రోజు ఈ గింజలు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..?
గుమ్మడికాయ గింజలు ఒక నేచురల్ సూపర్‌ఫుడ్. వీటిలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, జింక్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజువారీ డైట్‌లో వీటిని చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడం, షుగర్ కంట్రోల్, ఇమ్యూనిటీ పెరుగుదల, మంచి నిద్ర, హార్ట్ హెల్త్ వంటి అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

రోజువారీ డైట్‌లో గుమ్మడికాయ గింజలు చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. వీటిలో విటమిన్స్, మినరల్స్, హెల్తీ ఫ్యాట్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, మెగ్నీషియం, ప్రోటీన్, జింక్, ఐరన్, పొటాషియం లాంటి న్యూట్రియెంట్స్ వీటిలో ఎక్కువగా ఉంటాయి. గుమ్మడికాయ గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
యూరిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్
గుమ్మడికాయ గింజల ఆయిల్ యూరిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌ను తగ్గిస్తుంది. ఇవి ప్రోస్టేట్ గ్రంథి వాపును కూడా తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.
మెన్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్
మెన్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్‌లో గుమ్మడికాయ గింజలు చాలా ఇంపార్టెంట్. వీటిలో జింక్, మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.
ఇమ్యూనిటీ
గుమ్మడికాయ గింజలలోని విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. వైట్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ పెంచి బాడీని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది.
మంచి నిద్ర
పడుకునే ముందు కొన్ని గింజలు తింటే బాగా నిద్ర పడుతుంది. వీటిలోని ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ త్వరగా నిద్రలోకి జారుకోవడానికి హెల్ప్ చేస్తుంది. జింక్, రాగి, సెలీనియం లాంటి మినరల్స్ స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి.
బ్లడ్ షుగర్ కంట్రోల్
గుమ్మడికాయ గింజలు బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. వీటిలో ఉండే హైపోగ్లైసీమిక్ లక్షణాలు బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ రిస్క్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్ రిస్క్‌ను తగ్గించడంలో కూడా ఇవి హెల్ప్ చేస్తాయి. గుమ్మడికాయ, అవిసె గింజలు కలిపి తినడం వల్ల డయాబెటిస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయని రీసెర్చ్‌లు చెబుతున్నాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




