AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine: కోవిడ్‌ టీకా తీసుకున్న తర్వాత జ్వరం ఎందుకు వస్తుంది..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

Covid Vaccine: కోవిడ్‌ టీకా తీసుకున్న తర్వాత చాలా మందిలో జ్వరం రావడం, అలాగే తీవ్రమైన తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటున్నాయి. దీంతో వ్యాక్సిన్‌ వేసుకుంటే..

Covid Vaccine: కోవిడ్‌ టీకా తీసుకున్న తర్వాత జ్వరం ఎందుకు వస్తుంది..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?
Covid Vaccine
Follow us
Subhash Goud

|

Updated on: Jun 10, 2021 | 6:02 PM

Covid Vaccine: కోవిడ్‌ టీకా తీసుకున్న తర్వాత చాలా మందిలో జ్వరం రావడం, అలాగే తీవ్రమైన తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటున్నాయి. దీంతో వ్యాక్సిన్‌ వేసుకుంటే కరోనా వస్తుందేమోనన్న అపోహా చాలా మందిలో ఉంది. అయితే, టీకా తర్వాత అలాంటి లక్షణాలు చాలా సాధారణమని, శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పునరుత్తేజమవుతుందని చెప్పడానికి అవే సంకేతాలని వైద్యులు చెబుతున్నారు. టీకా వేసుకున్న తర్వాత శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయంటున్నారు వైద్య నిపుణులు. రోగ నిరోధక వ్యవస్థలో రెండు ప్రధాన భాగాలుంటాయి. ఒకటి సహజ వ్యవస్థ. రెండోది సముపార్జిత వ్యవస్థ. మన ఒంట్లోకి ఏదైనా ప్రవేశించిందని శరీరం గుర్తించిన వెంటనే ఈ సహజ వ్యవస్థ స్పందించి ప్రతి చర్య ప్రారంభిస్తుంది. అలా మనం కరోనా టీకా వేసుకోగానే తెల్ల రక్తకణాలు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని ప్రక్రియ ప్రారంభిస్తాయి. దాని వల్లే టీకా వేసుకున్న భాగంలో తిమ్మిర్లు, నొప్పిగా అనిపించడం, అలసటగా ఉండటం లాంటి లక్షణాలు కన్పిస్తాయి.

ఇక రోగ నిరోధక వ్యవస్థలో ఈ రాపిడ్‌ రెస్పాన్స్‌ ప్రక్రియ వయసును బట్టి క్షీణిస్తుంది. యువతలో అయితే ఈ ప్రతిస్పందన ఎక్కువగా ఉంటే.. వృద్ధుల్లో తక్కువగా ఉంటుంది. అందుకే వృద్ధుల కంటే యువతలోనే టీకా తీసుకున్న తర్వాత జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. శరీరాన్ని బట్టి టీకా తీసుకున్న వారిలొ ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణాలు కనిపిస్తుంటాయంటున్నారు.

రెండో డోసు తీసుకున్న వారిలో..

అయితే రెండో డోసు టీకా తీసుకున్న వారి కొందరిలో జ్వరం, తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు పెద్దగా ఉండకపోవచ్చు. అయిఏ ఇలాంటి లక్షణాలు లేకపోతే వ్యాక్సిన్‌ పని చేయడం లేదని కాదు.. అని వైద్య నిపుణులు అంటున్నారు. ఇక రెండో విషయానికొస్తే.. టీకాలు మన రోగ నిరోధక వ్యవస్థలోని రెండో ప్రధాన భాగమైన సముపార్జిత వ్యవస్థను చైతన్యవంతం చేస్తాయి. టి, బి కణాలు, యాంటీబాడీలు ఇందులోని భాగమే. అసలైన ప్రక్రియ అప్పుడే ప్రారంభం అవుతుంది. దీని వల్ల శరీరంలో యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవే వైరస్‌ నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి.

టీకా తీసుకున్న తర్వాత అలర్జీ..

ఇక టీకా తీసుకున్న తర్వాత చాలా తక్కువ మందిలో వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాతే అలర్జీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు అమెరికా వైద్యులు. అయితే, ఇది చాలా అరుదుగా జరగవచ్చని చెబుతున్నారు. కాగా.. టీకా వల్ల ఎలాంటి లక్షణాలు కల్పించినా అవి గంటలు లేదా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు. కానీ ఎక్కువ కాలం లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యున్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఏదేమైనా లేనిపోని అపోహాలు పెట్టుకుని వ్యాక్సిన్‌కు దూరంగా ఉండవద్దని, అవసరం అనుకుంటే వైద్యుల సలహాలు తీసుకుని తప్పకుండా వ్యాక్సిన్‌ వేయించుకోవడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Vaccination: వేగంగా దేశంలో వ్యాక్సినేషన్..ప్రపంచంలోనే ఎక్కువ వ్యాక్సిన్ లు వేసిన దేశాల్లో రెండో స్థానంలో భారత్!

Stress Relaxation: మానసిక ఒత్తిడితో కుంగిపోతున్నారా?.. అయితే ఇలా చేయండి.. ఆరోగ్యంగా ఉండండి..