AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: డాక్టర్లు రోగి నాలుకను ఎందుకు పరీక్షిస్తారు.? దీంతో ఏం తెలుసుకుంటారు.?

నాలుకలో వచ్చే మార్పుల ఆధారంగా మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంటారు. ముఖ్యంగా నాలుకలో వచ్చే మార్పుల ఆధారంగా మనిషి ఆరోగ్యాన్ని వైద్యులు తెలుసుకుంటారు. నాలుక రంగులో వచ్చే మార్పులను బట్టి మనిషి ఆరోగ్యం బాగుందా లేదా అనేది అంచనా వేయొచ్చు. అయితే నాలుకలో కనిపించే మార్పులు ఆధారంగా వైద్యులు ఎలాంటి నిర్ధారణకు వస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

Health: డాక్టర్లు రోగి నాలుకను ఎందుకు పరీక్షిస్తారు.? దీంతో ఏం తెలుసుకుంటారు.?
Tongue Health
Narender Vaitla
|

Updated on: Oct 31, 2023 | 8:43 AM

Share

ఏదైన అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్లగానే డాక్టర్‌ ముందుగా కళ్లతో పాటు, నాలుకను పరీక్షిస్తారు. కళ్లలో, నాలుకలో వచ్చే మార్పుల ఆధారంగా మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంటారు. ముఖ్యంగా నాలుకలో వచ్చే మార్పుల ఆధారంగా మనిషి ఆరోగ్యాన్ని వైద్యులు తెలుసుకుంటారు. నాలుక రంగులో వచ్చే మార్పులను బట్టి మనిషి ఆరోగ్యం బాగుందా లేదా అనేది అంచనా వేయొచ్చు. అయితే నాలుకలో కనిపించే మార్పులు ఆధారంగా వైద్యులు ఎలాంటి నిర్ధారణకు వస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి నాలుకు గులాబీ రంగులో ఉంటుంది. లేత గులాబీ, ముదురు గులాబీ రంగులో ఉంటుది. ఇక నాలుకపై సన్నని తెల్లటి పొర ఉంటుంది. ఇక ఆరోగ్యకరమైన వ్యక్తిలో నాలు తేమగా ఉంటుంది.

* ఒకవేళ నాలుకపై తెల్లటి మచ్చలు కనిపిస్తే ఈస్ట్ ఇన్ఫెక్షన్‌కు సంకేతంగా చెప్పొచ్చు. నాలుకపై తెల్లటి మచ్చలు ల్యూకోప్లాకియా వల్ల కనిపిస్తాయి. అయితే దీని వల్ల పెద్దగా అనారోగ్య సమస్యలు లేకపోయినా కొన్ని సందర్భాల్లో మాత్రం క్యాన్సర్‌కు సంకేతంగా కావొచ్చు. దీని ఆధారంగా రోగి ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు.

* నాలుక నల్లగా కనిపిస్తే జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు. గొంతులో బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటి కారణంగా నాలుక నలుపు రంగులోకి మారుతుంది. కొన్ని సందర్భాల్లో నాలుక నలుపు రంగులోకి మారడం క్యాన్సర్‌కు కూడా సూచికగా చెబుతుంటారు. అందుకే ఒకవేళ నాలుక రంగు నలుపులోకి మారితే వెంటనే అలర్ట్‌ అవ్వాలి.

* ఇక ఒకవేళ నాలుక పసుపు రంగులోకి మారితే కామెర్లుగా భావిస్తుంటాం. అయితే ఇది నిజమే అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో డయాబెటిస్‌ కూడా సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ నాలుక పసుపు రంగులోకి మారుతున్నట్లు కనిపిస్తే షుగర్‌ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

* నాలుక ఒకవేళ నీలి రంగులోకి మారినట్లు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. నాలుక నీలి రంగులోకి మారితే గుండె సంబంధిత వ్యాధులను సూచిస్తుందని చెబుతున్నారు. గుండె శరీరంలో రక్తాన్ని సరిగ్గా పంప్‌ చేయని సమయంలో నాలుక నీలి రంగులోకి మారుతుంది. రక్తంలో ఆక్సిజన్‌ సరైన స్థాయిలో లేనప్పుడు కూడా నాలుక నీలి రంగులోకి మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే సూచించదగ్గ అంశం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!