AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spicy Food: స్పైసీగా ఉండాలని కారం ఎక్కువగా తింటున్నారా..? ఆగమైపోతారు జాగ్రత్త..

Spicy Food Effects: స్పైసీ ఫుడ్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు.. భారతీయ ఆహారంలో స్పైసీ ఫుడ్ ఒక ముఖ్యమైన భాగం.. సాధారణంగా మనం.. పప్పు నుంచి మొదలుకుని అన్ని రకాల కూరలకు వరకు.. మిర్చి ఉండాల్సిందే.. ఎర్ర మిరపకాయల కారంతో అన్ని రకాల వంటకాలను చేయడానికి ఇష్టపడతాము. ఏది లేకపోయిన మన వంటగదిలో ఎర్ర మిరపపొడి ఉండాల్సిందే.

Spicy Food: స్పైసీగా ఉండాలని కారం ఎక్కువగా తింటున్నారా..? ఆగమైపోతారు జాగ్రత్త..
Spicy Food
Shaik Madar Saheb
|

Updated on: Oct 30, 2023 | 9:46 PM

Share

Spicy Food Effects: స్పైసీ ఫుడ్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు.. భారతీయ ఆహారంలో స్పైసీ ఫుడ్ ఒక ముఖ్యమైన భాగం.. సాధారణంగా మనం.. పప్పు నుంచి మొదలుకుని అన్ని రకాల కూరలకు వరకు.. మిర్చి ఉండాల్సిందే.. ఎర్ర మిరపకాయల కారంతో అన్ని రకాల వంటకాలను చేయడానికి ఇష్టపడతాము. ఏది లేకపోయిన మన వంటగదిలో ఎర్ర మిరపపొడి (కారం) ఉండాల్సిందే. మిరపకాయలను బట్టి.. పొడిని మితంగా ఉపయోగిస్తారు. అయితే స్పైసీ వస్తువులను పరిమిత పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే వాటిని అధికంగా తీసుకుంటే మీరు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, కారం, మసాలా ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

స్పైసీ ఫుడ్ ఎందుకు తినకూడదు..?

  1. అజీర్ణం: స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడుతాయి. దీని వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపు సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా పనిచేయడానికి స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం పరిమితం చేయడం ముఖ్యం.
  2. మానసిక సమస్యలు: స్పైసీ ఫుడ్ తినడం వల్ల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. ఇది మరింత ఒత్తిడి, ఆందోళన, విశ్రాంతికి ఆటంకం కలిగిస్తుంది. మానసిక ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపకుండా స్పైసీ ఫుడ్‌ను పరిమితంగా తీసుకోవడం మంచిది.
  3. అధిక రక్తపోటు: స్పైసీ ఫుడ్‌లో ఎక్కువ ఉప్పు, మసాలాలు ఉంటాయి. దీని కారణంగా బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. మీరు ఇప్పటికే అధిక BP ఉన్న రోగి అయితే మిరపకాయలు.. మసాలాలు తీసుకోవడం తగ్గించండి. లేకుంటే దీర్ఘకాలంలో ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది.
  4. డ్రై స్కిన్: స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంలోని తేమ తగ్గి, పొడిబారడంతోపాటు చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి మిరపకాయలు, మసాలాలు పరిమిత పరిమాణంలో మాత్రమే తినడం మంచిది.
  5. బరువు పెరుగుట: ఘాటైన, మసాలా ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల బరువు పెరుగుతారు. దీనికి కారణం ఇందులో ఎక్కువ క్యాలరీలు ఉండటమే.. తిన్న తర్వాత కూడా మీకు మరింత ఆకలిగా అనిపిస్తుంది. దీంతో బరువు మరింత పెరుగుతుంది.
  6. పైల్స్: ఎక్కువగా మిరపకాయలు, మసాలాలు తినే వారికి పైల్స్ తరచుగా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు మిర్చి ఎక్కువ ఉపయోగం వల్ల మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని.. ఈరోజే మసాలాలు, మర్చి తినడం తగ్గించడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..