Pregnancy Care: గర్భధారణ సమయంలో మహిళలకు ఎందుకు తలనొప్పి వస్తుంది?.. కారణాలు, నివారణ సూచనలు మీకోసం..

Pregnancy Care: గర్భధారణ సమయంలో స్త్రీల శరీరంలోని హార్మోన్లలో అనేక మార్పులు జరుగుతాయి. దీని కారణంగా, స్త్రీ అనేక సమస్యలను..

Pregnancy Care: గర్భధారణ సమయంలో మహిళలకు ఎందుకు తలనొప్పి వస్తుంది?.. కారణాలు, నివారణ సూచనలు మీకోసం..
Pragnant
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Aug 12, 2021 | 7:18 AM

Pregnancy Care: గర్భధారణ సమయంలో స్త్రీల శరీరంలోని హార్మోన్లలో అనేక మార్పులు జరుగుతాయి. దీని కారణంగా, స్త్రీ అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యలలో ముఖ్యంగా తలనొప్పి కూడా ఒకటి. గర్భధారణ సమయంలో తలనొప్పి ఎందుకు వస్తుంది? అనేదానికి ఖచ్చితమైన కారణం వెల్లడి కాలేదు. కానీ, తలనొప్పి సమస్యకు కారణం ప్రతి నెలా భిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు గర్భిణీ స్త్రీలకు తలకు ఒకవైపు మాత్రమే నొప్పి వస్తుంది. దీనిని మైగ్రేన్ అంటారు. ఇది కాకుండా, హార్మోన్లలో మార్పులు, బరువులో మార్పులు, రక్తం పరిమాణం తలనొప్పిని ప్రేరేపిస్తాయి. ఇదే కాదు.. గర్భిణీ స్త్రీలలో తలనొప్పి అనేక కారణాలు ఉన్నాయి. మరి ఆ కారణాలేంటి? ఎలాంటి నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మొదటి త్రైమాసికం.. గర్భవతి అయిన మహిళకు మొదటి త్రైమాసికంలో(మూడు నెలల సమయంలో) తలనొప్పి.. శరీరంలో పోషకాలు లేకపోవడం, వాంతులు, వికారం, నీరు లేకపోవడం, ఒత్తిడి, నిద్ర లేకపోవడం మొదలైన కారణంగా వస్తుంది. ఇది కాకుండా, తక్కువ రక్తపోటు కారణంగా కూడా తలనొప్పి సంభవించవచ్చు.

రెండవ మరియు మూడవ త్రైమాసికంలో.. గర్భదారణ సమయంలో రెండవ, మూడవ త్రైమాసికంలో వచ్చే తలనొప్పి.. ఒత్తిడి వలన సంభవించవచ్చు. ఇది కాకుండా.. అధిక బరువు, అధిక రక్తపోటు, కండరాల ఒత్తిడి, పోషకాలు లేకపోవడం వల్ల కూడా తలనొప్పి సమస్య రావచ్చు. అలాగే కెఫిన్ అధికంగా తీసుకోవడం, కంటి చూపు బలహీనపడటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.

తలనొప్పి నివారణకు ఏం చేయాలి?.. – మంచి డైట్‌ను మెయింటేన్ చేయండి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, రసాలు, సలాడ్లు, మొలకెత్తిన ధాన్యాలు తినాలి. – క్రమం తప్పకుండా యోగా(ట్రైనర్స్ ఆధ్వర్యంలో), వ్యాయామం చేయండి. – ఒత్తిడిని జయించేందుకు ప్రతీ రోజూ ధ్యానం చేయాలి. – బీపీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ, తక్కువ బీపీ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ నిర్దేశించిన సమయానికి మందులు, సప్లిమెంట్లను తీసుకోవాలి. – అయితే, ఈ సమస్య అధికమైతే.. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

Also read:

Andhra Pradesh: నాలుగేళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయిన భర్త.. విగ్రహానికి నిత్యం పూజలు చేస్తున్న మహిళ..

Hyderabad City: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. చదువు నేర్పుతారని పిల్లలను పంపిస్తే..

Telangana Collectors: తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు.. హైదరాబాద్ కలెక్టర్‌గా ఎల్. శర్మన్..

ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!