రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. ఇంటికి పిలిపించిన సూపర్ స్టార్ ఏం చేశారంటే?

స్టార్ హీరోలు, హీరోయిన్లకు అభిమానులు గుళ్లు కట్టడం కొత్తేమీ కాదు. గతంలో ఖుష్బూ, నమిత, నయనతార, సమంత, హన్షిక, నిధి అగర్వాల్ కు గుడి కట్టేశారు ఫ్యాన్స్. తాజాగా రజనీకాంత్ అభిమాని.. తన ఫేవరెట్ నటుడి కోసం తన ఇంట్లోనే గుడి కట్టి పూజలు చేస్తున్నాడు.

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. ఇంటికి పిలిపించిన సూపర్ స్టార్ ఏం చేశారంటే?
Rajinikanth
Follow us
Basha Shek

|

Updated on: Jan 06, 2025 | 11:53 AM

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. అందులో మధురై జిల్లా తిరుమంగళానికి చెందిన కార్తీక్ కూడా ఒకరు. సైనికుడిగా సరిహద్దులో సేవలందించి రిటైరైన అతనికి రజనీకాంత్ అంటే చెప్పలేని అభిమానం. తన ఫేవరెట్ హీరోకు మనసులో గుడి కట్టేసుకున్న కార్తీక్ ఇటీవలే ఏకంగా తన ఇంట్లోనూ గుడి కట్టేశాడు. అంతేకా కుండా రజనీ విగ్రహం ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఇప్పుడీ విషయం సూపర్ స్టార్ రజనీ కాంత్ దాకా వెళ్లింది. ఈ విషయం తెలిసిన ఆయన తనకు గుడి కట్టించిన వీరాభిమాని కార్తీక్‌ అతని కుటుంబ సభ్యులను చెన్నై, పోయస్‌ గార్డెన్లోని తన ఇంటికి రప్పించారు. తన అభిమానిని ప్రత్యేకంగా అభినందించారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా వారికి తన ఇంటిని చూపించి వారితో ఫొటోలు దిగారు. అలాగే బాబా విగ్రహాన్ని కానుకగా అందించారు. చివరిగా వారికి రుచికరమైన వంటకాలతో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు కూడా ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. దీనిని చూసిన రజనీ కాంత్ అభిమానులు తమ హీరోతో పాటు కార్తీక్ పైనా ప్రశంసలు కురిపిస్తున్నారు.

రజనీకాంత్ విగ్రహానికి పూజలు చేస్తోన్న కార్తీక్.. వీడియో

ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది లాల్ సలామ్, వెట్టయ్యాన్ సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించారు రజనీకాంత్. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, షోబిన్ సాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబ్బా మోనికా జాన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఆమిర్ ఖాన్ కూడా ఓప్రత్యేక పాత్రలో నటించచనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కూలి సినిమాలో రజనీకాంత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.