రోజు ఇలా చేస్తే షుగర్‌ సమస్య అస్సలు ఉండదు.. 

TV9 Telugu

06 January 2025

షుగర్‌ వ్యాధిని అదుపులో ఉంచుకునేది ముఖ్యంగా అల్పాహారంలో ఏం తింటున్నామనేదే కాదు, ఎప్పుడు తింటున్నామన్నదీ ముఖ్యమే అంటన్నారు నిపుణులు.

షుగర్‌ వ్యాధిగ్రస్తులు అల్పాహారం విషయంలో మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐఎస్‌గ్లోబల్‌ అధ్యయనకారులు తమ పరిశోధనల్లో గుర్తించారు.

ఉదయం 9 గంటల తర్వాత అల్పాహారం చేసినవారితో పోలిస్తే ఉదయం 8 గంటల్లోపే తినేవారికి షుగర్‌ వ్యాధి ముప్పు 60 శాతం వరకు తగ్గుతన్నట్టు గుర్తించారు.

అరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి శ్రమ కలిగించే పనులు చేయకపోవడం, ధూమపానం వంటివి టైప్‌ 2 మధుమేహం వాటిల్లడానికి కారకాలుగా తేల్చారు.

ప్రతిరోజు ఉదయం 9 గంటల తర్వాత టిఫిన్‌ చేసేవారికి షుగర్‌ వ్యాధి ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు.

పొద్దున్నే టిఫిన్‌ చేయడం మానేయటం వల్ల గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ నియంత్రణ గాడి తప్పుతాయి, ఇన్సులిన్‌ హార్మోన్‌ మోతాదులూ అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

ఉదయం టిఫిన్‌ విషయంలోనే కాదు.. డిన్నర్‌ కూడా రాత్రి 10 గంటల తర్వాత తినేవారికీ మధుమేహం ముప్పు ఎక్కవగా ఉన్నట్టు అధ్యయనకారులు తేల్చారు.

అల్పాహారం పొద్దున 8 గంటల్లోపు, డిన్నర్‌ సాయంత్రం 7 లోపు చేస్తే షుగర్‌ ముప్పు వచ్చే ఆస్కారం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.