Weight Loss: నిత్యం ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఇది మీ వల్ల అవుతుందా..?
Weight Loss Tips: ఆధునిక కాలంలో చాలామంది బరువు సమస్యతో సతమతమవుతున్నారు. వాస్తవానికి ఏదైనా ఒక కారణం వల్ల బరువు పెరగదు.
Weight Loss Tips: ఆధునిక కాలంలో చాలామంది బరువు సమస్యతో సతమతమవుతున్నారు. వాస్తవానికి ఏదైనా ఒక కారణం వల్ల బరువు పెరగదు. దీనికి మన జీవనశైలి, ఆహారం, ఏదైనా వ్యాధి లేదా మందుల ప్రభావం, ఒత్తిడి లాంటి అనేక కారణాలు ఉంటాయి. పలు కారణాలతో శరీర బరువు (Weight Loss) చాలా వేగంగా పెరుగుతుంది.. కానీ దానిని తగ్గించడం మాత్రం అంత సులువైన పనికాదు. శరీరంలోని అన్ని భాగాలపై కొవ్వు పేరుకొని.. శరీర ఆకృతి మొత్తం దుర్భరంగా మారుతుంది. అంతే కాదు ఊబకాయం (Obesity) వల్ల హైబీపీ, మధుమేహం, థైరాయిడ్ వంటి సమస్యలన్నీ చుట్టుముడతాయి. ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి తగిన సమయంలో స్థూలకాయాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. మీరు బరువు తగ్గడానికి అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోతే.. కొన్ని అలవాట్లను నిరంతర ప్రక్రియలో భాగం చేసుకుంటే.. సులభంగా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. మీరు ఈ పద్దతులను తప్పనిసరిగా పాటిస్తే.. కొద్ది రోజుల్లోనే మీ బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ప్రతిరోజు సమయానికి అల్పాహారం తీసుకోండి
కొంతమందికి అల్పాహారం తినడానికి సమయం ఉండదు. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు తింటుంటారు. అయితే ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అల్పాహారం, రాత్రి భోజనం చేసే సమయంలో ఎక్కువ గ్యాప్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అల్పాహారం మీకు రోజంతా శక్తిని ఇస్తుంది. కాబట్టి ప్రతిరోజూ సమయానికి అల్పాహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి.
2. రోజూ వ్యాయామం చేయండి
ఉదయాన్నే లేచి ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. మనం రోజులో ఎలాంటి అదనపు కేలరీలు తీసుకున్నా.. వాటిని బర్న్ చేయడం చాలా ముఖ్యం. ప్రస్తుతం కూర్చొని పనిచేసే సంస్కృతి వల్ల శారీరక శ్రమ జీరో అయిపోయింది. ఈ సందర్భంలో బరువు వేగంగా పెరుగుతుంది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
3. పుష్కలంగా నీరు తాగండి
నీరు తాగడం వల్ల శరీరంలోని విషపూరిత వ్యర్థాలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి నీరు తాగేందుకు అస్సలు వెనుకాడొద్దు. నీరు పుష్కలంగా తాగాలి. నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఇది మీ శరీరంలోని అదనపు కొవ్వును కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఐదు లీటర్ల నీరు తాగడం మంచిది.
4. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఎక్కువగా వేయించిన, మసాలా పదార్థాలు తినడం మానుకోండి. ఆహారంలో సలాడ్, పచ్చి కూరగాయలు, పండ్లు, రసాలు, మొలకలు, ఉప్మా, కొబ్బరి నీళ్లు, మజ్జిగ మొదలైన వాటిని చేర్చండి. కేలరీలు ఎక్కువగా ఉండే వాటిని తినడం మానుకోండి.
5. బరువు తగ్గించే లక్ష్యాన్ని నిర్ధేశించుకోండి
మీరు ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారో ముందు లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వల్ల దీనిపై మీ నిబద్ధత పెరుగుతుంది. అయితే ఈ విషయాన్ని మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.. ఒక రోజులో ఏ పని జరగదు.. దాని కోసం చాలా కష్టపడాలన్న సూక్తిని మాత్రం మారువద్దంటున్నారు నిపుణులు.
Also Read: