AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: మీ పాదాలలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది.. ఎందుకంటే..

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుదల చాలా ప్రమాదకరం.. దీనివల్ల నరకం అనుభవించాల్సి వస్తుంది. యూరిక్ యాసిడ్‌కి ఎక్కువ కాలం చికిత్స చేయకుండా వదిలివేస్తే.. కిడ్నీలు పాడయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. దీంతో దీర్ఘకాలం పాటు బాధపడాల్సి వస్తుంది. అయితే, శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. ముందుగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.

Health: మీ పాదాలలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది.. ఎందుకంటే..
Uric Acid
Shaik Madar Saheb
|

Updated on: Apr 15, 2024 | 3:51 PM

Share

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుదల చాలా ప్రమాదకరం.. దీనివల్ల నరకం అనుభవించాల్సి వస్తుంది. యూరిక్ యాసిడ్‌కి ఎక్కువ కాలం చికిత్స చేయకుండా వదిలివేస్తే.. కిడ్నీలు పాడయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. దీంతో దీర్ఘకాలం పాటు బాధపడాల్సి వస్తుంది. అయితే, శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. ముందుగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. దీంతో ముందుగానే అప్రమత్తం అవ్వడం ద్వారా.. ప్రమాదాన్ని ముందుగానే నియంత్రించవచ్చు.. అటువంటి పరిస్థితిలో, పాదాలలో కనిపించే కొన్ని సంకేతాల ద్వారా ప్రారంభ దశలోనే అధిక యూరిక్ యాసిడ్ ఉన్నట్లు గుర్తించవచ్చని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..

శరీరంలో ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్ అనే పదార్ధం.. దీని విచ్ఛిన్నం ద్వారా ఏర్పడిన రసాయనం. ఇది ఆరోగ్యానికి అవసరమే కాకుండా హానికరం కూడా. ఇది మీ శరీరంలో ఎంత ఉందో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. తగిన పరిమాణంలో ఉంటే ఏం కాదు కానీ.. ఎక్కువ అయితేనే ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు పేర్కొంటున్నారు.

అటువంటి పరిస్థితిలో, యూరిక్ యాసిడ్ పరిమాణం ఎక్కువగా ఉంటే, మూత్రపిండాల్లో రాళ్లు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కొన్ని అధ్యయనాలలో, ఇది అధిక రక్తపోటు, గుండె వైఫల్యం, మెటబాలిక్ సిండ్రోమ్‌తో ముడిపడి ఉంది. ఒక వ్యక్తికి మధుమేహం, స్ట్రోక్ వచ్చే అవకాశాలను పెంచే కొన్ని అంశాలు ప్రాణాంతక వైద్య పరిస్థితికి దారితీయవచ్చు.. అటువంటి పరిస్థితిలో, ఈ ప్రమాదాలను నివారించడానికి అధిక యూరిక్ యాసిడ్ ప్రారంభ లక్షణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

యూరిక్ యాసిడ్ స్థాయి ఎంత ఉండాలి?

ఆర్థరైటిస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యూరిక్ యాసిడ్ సాధారణంగా పురుషులలో 7 మిల్లీగ్రాముల డెసిలీటర్‌ (mg/dL), మహిళల్లో 6 mg/dL కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా పరిగణిస్తారు.

పాదాలలో కనిపించే లక్షణాలు..

  • కాలి బొటనవేలు నొప్పి
  • బొటనవేలు వాపు
  • చీలమండ నుంచి మడమ వరకు నొప్పి
  • పాదాల కింది భాగంలో ఉదయం వేళ తీవ్రమైన నొప్పి
  • మోకాలి నొప్పి

ఈ లక్షణాలపై నిఘా ఉంచండి..

శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగినప్పుడు నొప్పి, కీళ్లలో దృఢత్వం, చుట్టుపక్కల చర్మం ఎర్రబడడం, మూత్రంలో రక్తం, తరచుగా మూత్రవిసర్జన, జననేంద్రియ ప్రాంతం నుంచి నడుము వరకు నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

శరీరంలో యూరిక్ పెరగడానికి కారణాలు..

అధిక స్థాయిలో యూరిక్ యాసిడ్ అనేది మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్లని రసాయన ఉత్పత్తి. ఒక వ్యక్తి అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం ప్రారంభించినప్పుడు లేదా డైయూరిటిక్స్ తీసుకున్నప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది. ఇది కాకుండా, అధిక యూరిక్ యాసిడ్‌కు కారణాలు ఎక్కువగా సోడా, ఫ్రక్టోజ్ ఉన్న ఆహారాల వినియోగం.. అధిక రక్తపోటు, రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు, మూత్రపిండాల సమస్యలు, లుకేమియా, మెటబాలిక్ సిండ్రోమ్, ఊబకాయం, ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాల వినియోగం.. అని నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..