AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటిస్ బాధితులకు అలర్ట్.. రాత్రిపూట ఇలా చేస్తే షుగర్‌కు కళ్లెం వేసినట్లే..

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రస్తుత కాలంలో చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధికి కారణం దుర్భురమైన జీవనశైలి.. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ శరీరంలో చక్కెర స్థాయిని పెంచడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది. ప్రస్తుతం, ఈ వ్యాధిని ఆహారం, వ్యాయామం ద్వారా మాత్రమే నియంత్రించవచ్చు.

డయాబెటిస్ బాధితులకు అలర్ట్.. రాత్రిపూట ఇలా చేస్తే షుగర్‌కు కళ్లెం వేసినట్లే..
Sleeping
Shaik Madar Saheb
|

Updated on: Apr 15, 2024 | 6:06 PM

Share

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రస్తుత కాలంలో చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధికి కారణం దుర్భురమైన జీవనశైలి.. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ శరీరంలో చక్కెర స్థాయిని పెంచడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది. ప్రస్తుతం, ఈ వ్యాధిని ఆహారం, వ్యాయామం ద్వారా మాత్రమే నియంత్రించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెర స్థాయిని నియంత్రించడానికి కొన్ని నియమాలను పాటించాలి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రి నిద్రపోయేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. దీంతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ ఐదు చిట్కాలను పాటిస్తే వారి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడతాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..

షుగర్ అదుపులో ఉంచుకునేందుకు చిట్కాలు..

పడుకునే ముందు టీ తాగకూడదు..

టీ, కాఫీలో కెఫీన్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి. డయాబెటిక్ రోగులకు కనీసం 7 నుండి 8 గంటల మంచి నిద్ర అవసరమని పరిశోధనలో తేలింది. కాబట్టి మంచి నిద్ర రావాలంటే పడుకునే మూడు గంటల ముందు టీ, కాఫీలు తాగకండి.

రాత్రి భోజనంపై శ్రద్ధచూపాలి..

మధుమేహం తర్వాత మీరు మీ ఆహారంపై శ్రద్ధచూపాలి.. ఎందుకంటే మీ ఆహారం సరైనది కాకుంటే చక్కెర స్థాయి పెరుగుతుంది. రాత్రిపూట మీ రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడానికి రాత్రి భోజనంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల మిశ్రమంతో భోజనం చేయండి. అలాగే రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి.

శారీరక శ్రమ అవసరం..

మధుమేహ వ్యాధిగ్రస్తులు శారీరక శ్రమ చేయాలి. రాత్రి భోజనం తర్వాత తేలికపాటి వ్యాయామం చేయాలి. కొంచెంసేపు నడవండి. భోజనం తర్వాత ఈ అలవాటు షుగర్ లెవెల్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.

శ్వాస వ్యాయామం..

రాత్రి పడుకునే ముందు విశ్రాంతి ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.. మంచి నిద్రకు దారి తీస్తుంది. చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.

పడుకునే ముందు HbA1c పరీక్ష..

డయాబెటిక్ రోగులు పడుకునే ముందు వారి రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేయాలి. ఇది మీ చక్కెరను అదుపులో ఉంచడంలో మీకు సహాయపడుతుంది.

ఇలాంటి చిట్కాలతో మీరు మీ రోజువారీ జీవితాన్ని ఆనందంగా గడపవచ్చంటున్నారు.. ఆరోగ్య నిపుణులు.. ఎప్పుడైనా షుగర్ కంట్రోల్ లో ఉండకపోతే వైద్యులను సంప్రదించడం మర్చిపోకండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..