Health Tips: రాత్రుళ్లు నిద్ర పట్టక తెగ ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ టిప్ పాటిస్తే చాలు.. కొన్ని క్షణాల్లోనే..

కొంతమంది నిద్రపోవడానికి చాలా సమయం పడుతుంది. త్వరగా పడుకుందామని ఎంత ప్రయత్నించినా సరిగా నిద్రపోలేరు. అయితే ఈ సులభమైన హోమ్ ట్రిక్ పాటిస్తే, పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు.

Health Tips: రాత్రుళ్లు నిద్ర పట్టక తెగ ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ టిప్ పాటిస్తే చాలు.. కొన్ని క్షణాల్లోనే..
sleep
Venkata Chari

|

Apr 21, 2022 | 8:49 PM

రాత్రి సమయంలో మీరు పడుకున్నప్పుడు, సాధారణంగా 15 నుంచి 20 నిమిషాలలోపు నిద్రపోతారు. అయితే కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిద్ర రాదు. చాలా గంటలు అలాగే నిద్ర కోసం ఎదరుచూస్తూ ఉండాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులే మీకు ఎదరైతే, మీకోసం కొన్ని టిప్స్ సిద్ధంగా ఉన్నాయి. మంచి నిద్రను పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పడుకున్న వెంటనే నిద్ర పట్టకపోవడానకి అతిపెద్ద కారణం ఒత్తిడి హార్మోన్ అని తెలుస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం, దాదాపు 42 శాతం మంది ప్రజలు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అంటే ఒత్తిడి హార్మోన్ల కారణంగా నిద్రలేమితో బాధపడుతున్నారని తెలుస్తోంది. పగటిపూట నిద్రపోయే అలవాటు ఉన్నవారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే పగలు నిద్రపోవడం, రాత్రి కూడా నిద్రలేకపోవడం వల్ల శరీరంలోని బయోలాజికల్ క్లాక్ పూర్తిగా చెదిరిపోతుంది. దాని వల్ల శరీరంలో అనేక రకాల వ్యాధులు పెరగడం ప్రారంభిస్తాయి. పడుకున్న వెంటనే కొన్ని నిమిషాల్లో నిద్రపోవడానికి సులభమైన మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఒత్తిడి హార్మోన్లను నియంత్రించాలంటే..

మీరు ఇంట్లోనే స్ట్రెస్ బస్టర్ సాల్ట్‌ను తయారు చేసుకోవచ్చు. పడుకునే ముందు కొన్ని నిమిషాల ముందు నాలుక కింద ఈ పదార్థాన్ని ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఉప్పు చేయడానికి ఈ పద్ధతిని అనుసరించండి..

1 టీస్పూన్ ఉప్పు

1 టీస్పూన్ చక్కెర

రెండున్నర టీస్పూన్ తేనె

వీటన్నింటిని కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక చెంచాలో తీసుకొని నిద్రపోయే ముందు నాలుక కింద ఉంచండి. ఏ సమయంలోనైనా మీరు మానసిక ప్రశాంతత, విశ్రాంతిని పొందుతారు. మీకు కావాలంటే, ఉప్పు, పంచదారను సమాన పరిమాణంలో కలపండి. ఈ మిశ్రమాన్ని అర టీస్పూన్ తీసుకుని, నిద్రపోయే ముందు దానికి ఒకటిన్నర టీస్పూన్ల తేనెను జోడించి తినండి.

ఎలా పనిచేస్తుందంటే?

ఈ చక్కెర, ఉప్పు, తేనె మిశ్రమం త్వరగా నిద్రపోవడానికి మీకు ఎలా సహాయపడుతుందని ఈ ప్రశ్న మీ మదిలో రావచ్చు. సమాధానం ఏమిటంటే, చక్కెర ఒత్తిడి హార్మోన్లను స్రవించకూడదనే సంకేతాలను మీ మెదడుకు పంపిస్తుంది. అయితే ఉప్పు అడ్రినలిన్ హార్మోన్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మనస్సును త్వరగా ప్రశాంతంగా ఉంచడంలో తేనె సహకరిస్తుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోవాలి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచింది.

Also Read: పెరుగుతో కలిపి ఇవి తింటే ఎన్నో అద్భుత ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం.!

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? పరగడుపున ఈ డ్రింక్స్ తాగితే కొవ్వు ఇట్టే కరుగుతుంది

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu