ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టి పని చేస్తున్నారా.. చాలా డేంజర్ అండోయ్

ల్యాప్‌టాప్‌ కాళ్లపై పెట్టుకుని వాడితే.. వృషణాల దగ్గర, స్పెర్మ్ కణాల DNA దెబ్బతింటుందని అర్జెంటీనాలో నిర్వహించిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ల్యాప్‌టాప్‌ను కాళ్లపై పెట్టుకుని వాడితే.. దాని నుంచి ఉత్పత్తి అయ్యే వేడి కారణంగా చర్మం దెబ్బతింటుందని, ఇది స్కిన్‌ క్యాన్సర్‌ ముప్పును పెంచుతుందని యూనివర్శిటీ హాస్పిటల్ బాసెల్‌కు చెందిన స్విస్ పరిశోధకులు, ఆండ్రియాస్ ఆర్నాల్డ్ వెల్లడించారు.

ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టి పని చేస్తున్నారా.. చాలా డేంజర్ అండోయ్
Laptop On Lap
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 14, 2024 | 8:48 AM

చాలా మందికి బెడ్‌పై కూర్చుని ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేసే అలవాటు ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగినప్పటి నుంచి చాలామంది ఇంట్లో కూర్చుని ఇలానే వర్క్ చేస్తున్నారు. అయితే ఈ చిన్న పొరపాటు మీ ఆరోగ్యంపై ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతుంది. మీ ఒడిలో ల్యాప్‌టాప్‌ పెట్టుకుని.. మంచం మీద అలా పనిచేయడం మీకు సౌకర్యంగా అనిపించవచ్చు.. అనర్థాలు అయితే చాలా ఉన్నాయి. ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో ఇక్కడ తెలుసుకుందాం పదండి…

ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేయడం ప్రమాదం:

చర్మ వ్యాధులు:

ల్యాప్‌టాప్ నుండి వచ్చే వేడి గాలి చర్మంపై చికాకును కలిగిస్తుంది. దీనిని టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్ అంటారు. ల్యాప్‌ను ఒడిలో పెట్టుకుని ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల చర్మవ్యాధులు వస్తాయి.

సంతానోత్పత్తిపై ప్రభావం:

మీ ఒడిలో ల్యాప్‌టాప్‌తో పని చేయడం పురుషులలో సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ల్యాప్‌టాప్‌ల నుండి వచ్చే వేడి గాలి స్పెర్మ్ కౌంట్, నాణ్యతను తగ్గిస్తుంది. లాప్‌టాప్‌ వైర్‌లెస్ ఇంటర్నెట్ సిగ్నల్‌లను (మైక్రోవేవ్‌లు) అందుకుంటుంది, అనేక ఫ్రీక్వెన్సీలలో EMFలను విడుదల చేస్తుంది. కాళ్లపై పెట్టుకుని ల్యాప్‌టాప్‌ వాడితే.. మగవారిలో వీర్య కణాలపై ఎఫెక్ట్ పడుతుంది. అలానే మహిళలలో ఎగ్‌ రిలీజ్‌ సమక్రమంగా జరగదు.

వెన్నునొప్పి:

మీ ఒడిలో ల్యాప్‌టాప్‌ని పెట్టుకుని.. మంచంపై అలా వాలి ఎక్కువసేపు పని చేయడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. ల్యాప్‌టాప్‌ ఒడిలో పెట్టుకున్నారంటే.. నిటారుగా కూర్చోవడం అవ్వద్దు.  వంగి లేదా వాలి కూర్చోవాల్సి వస్తుంది. దీంతో వెన్నుముకపై ఒత్తిడి పడి.. నొప్పికి దారి తీస్తుంది. అలానే మెడపై కూడా ప్రభావం చూపుతుంది.

కాబట్టి ల్యాప్‌టాప్‌ను టేబుల్‌పై ఉంచి పని చేయడం మంచిది. అలానే కంటి సంరక్షణ కోసం, ప్రతి 20-30 నిమిషాలకు విరామం తీసుకోండి.  ఈ చిట్కాలను పాటించడం ద్వారా ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు.

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా సంబంధిత డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమ మార్గం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరణకు బ్రిటిష్ నేతల డిమాండ్
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరణకు బ్రిటిష్ నేతల డిమాండ్
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..