Health Tips: అందుకోసం పౌడర్‌ను ఎక్కువగా వాడుతున్నారా.. జాగ్రత్త పడకుంటే, ప్రమాదంలో పడ్డట్లే..
పౌడర్లలో ఉండే ఆస్బెస్టాస్.. ఊపిరితిత్తుల్లోకి చేరితే క్యాన్సర్‌కు కారణం అవుతుంది. అలాగే పౌడర్‌లో కృత్రిమ సువాసన కలుపుతారు. ఇది చర్మం, ఊపిరితిత్తులలో సమస్యలను కలిగిస్తుంది.
పౌడర్ క్యాన్సర్‌కు కారణమవుతుందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇప్పటికే ఓ ప్రముఖ కంపెనీ, ఈ మేరకు ఎన్నో ఆరోపణలు కూడా ఎదుర్కొంది. పౌడర్లల్లో ప్రమాదకరమైన ఆస్బెస్టాస్ పదార్ధం ఉపయోగిస్తుంటారు. ఇది ఇప్పటికే చాలా పౌడర్లలో కనుగొన్నట్లు వార్తల్లో వచ్చిన సంగతి తెలిసిందే. ఇది క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఈ కేసులో ఓ కంపెనీ కోట్లాది రూపాయల నష్టాన్ని చెల్లించాల్సి వచ్చింది. అందువల్ల, మీరు కూడా పౌడర్లను ఉపయోగించాలనుకుంటే, హెర్బల్ ఉత్పత్తులు వాడితే చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.
పౌడర్లలో ఉండే ఆస్బెస్టాస్.. ఊపిరితిత్తుల్లోకి చేరితే క్యాన్సర్‌కు కారణం అవుతుంది. అలాగే పౌడర్‌లో కృత్రిమ సువాసన కలుపుతారు. ఇది చర్మం, ఊపిరితిత్తులలో సమస్యలను కలిగిస్తుంది. టాల్కమ్ పౌడర్ వల్ల ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలు వస్తాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
హెర్బల్ ఉత్పత్తులు బెటర్..
మార్కెట్‌లో ఎన్నో రకాల పౌడర్లు మనకు అందుబాటులో ఉంటాయి. అందుకే ఏది పడితే అది వాడకుండా.. నిపుణుల సలహాలు తీసుకుని ఉత్తమమైనది ఎంచుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే మొక్కజొన్న పిండి లేదా మూలికలు లేదా సేంద్రీయ పౌడర్లను వాడితే చాలా మంచిది.
పౌడర్ ఎలా వేయాలి..
పిల్లలకు పౌడర్ వేయాలనుకుంటే, ప్రైవేట్ పార్ట్‌పై పౌడర్ వేయకూడదని గుర్తుంచుకోండి. అలాగే, పౌడర్‌ను చిలకరించే బదులు, ముందుగా చేతికి తీసుకుని, తర్వాత మెడ లేదా ముఖానికి అప్లై చేయండి. దీని కారణంగా, పౌడర్ సూక్ష్మ కణాలు ముక్కు లేదా నోటి ద్వారా శరీరం లోపలికి వెళ్లవు.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించడం చాలా మంచిది.