Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Back Pain: నడుమునొప్పి వేధిస్తోందా.. ఈ సింపుల్ చిట్కాలతో ఇలా తగ్గించుకోండి

ప్రస్తుత కాలంలో పని చేసే విధానం పూర్తిగా మారిపోయింది. లేవకుండా గంటల గంటలు పనిచేయడం, కూర్చునే, పడుకునే విధానంలో కారణాల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.....

Back Pain: నడుమునొప్పి వేధిస్తోందా.. ఈ సింపుల్ చిట్కాలతో ఇలా తగ్గించుకోండి
Back Pain2
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 09, 2022 | 7:45 AM

ప్రస్తుత కాలంలో పని చేసే విధానం పూర్తిగా మారిపోయింది. లేవకుండా గంటల గంటలు పనిచేయడం, కూర్చునే, పడుకునే విధానంలో కారణాల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నడుము నొప్పి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. అయితే కొన్ని చిట్కాల ద్వారా నడుము నొప్పి రాకుండా నివారించుకోవచ్చు. నొప్పి తగ్గేందుకు సాధారణంగా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుంటారు. కానీ మెడిసిన్స్ ను ఎక్కువగా వేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.అయితే ఈ సమస్యను కొన్ని సహజ పద్దతుల ద్వారా తగ్గించుకోవచ్చు. గంటల తరబడి కూర్చోవడం, సరైన భంగిమలో కూర్చోకపోవడం, విపరీతంగా బరువులను ఎత్తడం వంటి పనులు చేయడం వల్ల నడుముపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. వ్యాయామం చేయకపోవడం, శరీరంలో కాల్షియం తక్కువ అవడం వల్ల కూడా వెన్ను నొప్పి వస్తుంది.

వర్క్ ఫ్రం హోం చేసేవారు కంప్యూటర్ ముందు కూర్చోవడానికి కూర్చీలు వేరుగా ఉంటాయి. వాటిని వాడటం వల్ల నడుమునొప్పి సమస్య రాకుండా చూసుకోవచ్చు. పని కారణంగా గంటల తరబడి కూర్చుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే పని మధ్య మధ్యలో లేచి నడవాలి. అలా చేస్తే శారీరకంగా చురుగ్గా ఉంటారు. నొప్పి కూడా ఉండదు. గోరు వెచ్చని నీళ్లను కాసేపు నడుం పై పెడితే కూడా ఉపశమనం లభిస్తుంది. అల్లంలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది నడుం నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

పసుపు పాలు తాగినా నడుం నొప్పి రాకుండా ఉంటుంది. రెగ్యులర్ గా ఈ పసుపు పాలను తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా నడుము నొప్పిని కూడా తగ్గిస్తుంది. నిమ్మరసం నడుము నొప్పిని తగ్గించడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఇందులో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని పాటించేముందు నిపుణుల సూచనలు తీసుకోవడం మంచిది.