Diabetes: షుగర్‌ పేషెంట్స్‌కు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే డయాబెటిస్‌కు చెక్‌ పెట్టే దివ్యౌషధం.. 60 శాతం తగ్గనున్న ధరలు..

Diabetes: ప్రస్తుతం మధుమేహం ఒక పెద్ద సమస్యగా మారింది. మారుతున్న జీవనశైలి, శ్రమతగ్గడం, ఫాస్ట్‌ ఫుడ్‌ తీసుకోవడం పెరగడం, మారుతోన్న ఆహార అలవాట్లు, పని ఒత్తిడి, షిప్ట్‌ల్లో పని చేయడం..

Diabetes: షుగర్‌ పేషెంట్స్‌కు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే డయాబెటిస్‌కు చెక్‌ పెట్టే దివ్యౌషధం.. 60 శాతం తగ్గనున్న ధరలు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 09, 2022 | 7:16 AM

Diabetes: ప్రస్తుతం మధుమేహం ఒక పెద్ద సమస్యగా మారింది. మారుతున్న జీవనశైలి, శ్రమతగ్గడం, ఫాస్ట్‌ ఫుడ్‌ తీసుకోవడం పెరగడం, మారుతోన్న ఆహార అలవాట్లు, పని ఒత్తిడి, షిప్ట్‌ల్లో పని చేయడం.. కారణం ఏదైనా ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో షుగర్‌ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. హృద్రోగాల తర్వాత ఎక్కువ మంది ఈ వ్యాధిన బారినపడుతున్నట్లు నివేదికల్లో వెల్లడైంది. దీంతో చాలా ఫార్మా కంపెనీలు డయాబెటిక్‌ డ్రగ్స్‌ తయారీ రంగంలోకి అడుగుపెట్టాయి. ముఖ్యంగా నోటి ద్వారా తీసుకునే ఔషధాల తయారీ రంగం భారీగా టర్నోవర్‌లను సాధిస్తోంది. ప్రస్తుతం ఈ డ్రగ్‌కు మెర్క్‌, షార్ప్‌ అండ్‌ డోమెన్స్‌ అనే కంపెనీలు పేటెంట్‌ హక్కులను పొందాయి.

మెర్క్‌ కంపెనీ మధుహేహంతో బాధపడేవారి కోసం ప్రపంచవ్యాప్తంగా ఔషధాలను విక్రయిస్తోంది. అయితే ఈ కంపెనీలు ఈ నెలలో డ్రగ్‌కు సంబంధించిన పేటెంట్‌ హక్కులను కోల్పోయే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇది డ్రగ్‌ మార్కెట్‌లో పెద్ద కుదుపునకు దారి తీసే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో చాలా ఔషధ తయారీ కంపెనీలు ఈ స్థానాన్ని భర్తీ చేసే పేటెంట్‌ హక్కు పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ మార్కెట్‌ రీసర్చ్‌ సంస్థ ఏఐఓసీడీ ప్రకారం కనీసం 50 భారతీయ డ్రగ్స్‌ కంపెనీలు జనాదారణ పొందిన యాంటీ డయాబెటిస్‌ మందుల 100 జనరిక్‌ వెర్షన్‌లతో పోటీలోకి దిగుతున్నారు. ఇది ధరలు తగ్గడానికి కారణంగా మారుతుంది. మార్కెట్లోకి జనరిక్స్‌ ఎంట్రీ ఇవ్వడం ద్వారా ధరలు 60 శాతం తగ్గుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో కంపెనీల మధ్య పోటీ మరింత ముదురుతుందని అంచనా వేస్తున్నారు.

పానెకా బయోటిక్‌ అనే కంపెనీ 2019లో యాంటీ డయాబెటీస్‌ డ్రగ్‌ విల్డాగ్లిప్టిన్‌ సింగ్‌ డోస్‌ను తయారు చేసింది. నోటి ద్వారా తీసుకునే ఈ ట్యాబ్లెట్లను టైప్‌2 డయాబెటిస్‌ చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ డ్రగ్‌ అమ్మకాలు 2019లో రూ. 969 కోట్లు సాధించడం విశేషం. ఇది రక్తంలో చక్కర స్థాయిలను తగ్గిస్తుంది.

ఇక సిటాగ్లిప్టిన్‌ అనే ఔషధం కూడా డయాబెటిక్‌ పేటేంట్‌ కోసం పోడీ పడనున్నట్లు తెలుస్తోంది. సిటాగ్లిప్టిన్‌, మెట్‌ఫార్మిన్‌ల కాంబినేషన్‌లో రూపొందించిన డ్రగ్‌ను జానుమెట్ పేరుతో విక్రయిస్తున్నారు. సన్‌ఫార్మా కూడా భారత్‌లో సిటాగ్లిప్టిన్‌, సిటాగ్లిప్టిన్‌-మెట్‌ఫార్మిన్‌ మార్కెట్ చేస్తోంది. ప్రస్తుదం ఈ ఔషధాల మార్కెట్ రూ. 1000 కోట్లుగా ఉంది. ఇది నోటి ద్వారా తీసుకునే డయాబెటిస్‌ ఔషధాల భారత్‌ వాటాలో 10 శాతంగా ఉంది. జానువియో 100 ఎమ్‌జీ ట్యాబ్లెట్‌ ధర రూ. 45 కాగా, 50 ఎమ్‌జీ ధర రూ. 37.90గా ఉంది. జానుమెట్‌ 50/500 ఎమ్‌జీ, 50/100 ఎమ్‌జీ ధర రూ. 27గా ఉంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..