AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Health: ఇవి తింటే జుట్టు ఒత్తుగా, పెద్దగా పెరుగుతుంది..!

జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగాలంటే సరైన పోషకాహారమే కీలకం. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే ఆహారం వల్ల జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఒమేగా 3, బయోటిన్, ఐరన్ లాంటి పోషకాలతో నిండి ఉండే ఆహారాలు జుట్టుకు బలాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి.

Hair Health: ఇవి తింటే జుట్టు ఒత్తుగా, పెద్దగా పెరుగుతుంది..!
ముందుగా ఓ చిన్న గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాల నూనె తీసుకోవాలి. అందులో కొన్ని మెంతులు వేసి మరిగించాలి. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను తలకు బాగా అప్లై చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఇలా రాత్రిపూట చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గడం మీరు చూస్తారు.
Prashanthi V
|

Updated on: May 22, 2025 | 8:46 PM

Share

జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగాలంటే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. విటమిన్లు, ఖనిజాలు తగిన మోతాదులో ఉండే ఆహారం వల్లే జుట్టు బలంగా తయారవుతుంది. అందుకే పోషకాలు నిండిన ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం.

ఓట్స్, క్వినోవా వంటి పూర్తి ధాన్యాలలో విటమిన్ బి సమూహం, ఐరన్, జింక్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుకు బలాన్ని ఇస్తాయి జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. ప్రతి రోజు హోల్ గ్రెయిన్స్‌ ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు నష్టాన్ని తగ్గించి ఆరోగ్యవంతమైన జుట్టును కలిగిస్తాయి. బెర్రీస్ తినడం వల్ల జుట్టు పాడైపోవడం, చిట్లిపోవడం సమస్యలు తగ్గుతాయి.

క్యారెట్‌ లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఎ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టుకు తేమ వస్తుంది. క్యారెట్ తినడం వలన జుట్టు మెరుస్తుంది. దృఢత్వం పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు క్యారెట్ ఎంతో ఉపయోగకరం.

లీన్ మీట్‌ లో ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. లీన్ మీట్ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో పోషణ సమతుల్యం మెరుగుపడి జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టు రాలిపోవడం నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.

బాదం, వాల్ నట్లు, అవిసె గింజలు వంటి నట్స్ గింజలు కూడా జుట్టుకు మంచి ఆహారం. వీటి వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. ఈ ఆహారాలు జుట్టు రాలిపోవడాన్ని తగ్గించి చిట్లిపోవడం తగ్గిస్తాయి.

పాలకూరలో ఐరన్ విటమిన్ సి ఉన్నందున ఇది జుట్టుకు సహాయపడుతుంది. పాలకూర తినడం వల్ల జుట్టు బలంగా మారి జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయి.

గుడ్లలో అధికంగా ఉండే బయోటిన్, ప్రోటీన్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. గుడ్లు తినడం వలన జుట్టు సుదీర్ఘంగా, బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు సమస్యలు తగ్గిపోతాయి.

సాల్మన్, ట్యూనా లాంటి కొవ్వు చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుకి అవసరమైన పోషకాలు అందించి, జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడతాయి.

ఇలాంటి పోషకాహారాలను నిత్యం తీసుకుంటే జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తే జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకే ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రతిరోజూ మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)