లంగ్స్ హెల్త్ కోసం టాప్ బెస్ట్ ఫ్రూట్స్..! వీటిని తినడం మిస్సవ్వద్దు..!
మన శ్వాసకోశాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అధిక కాలుష్యం, పొగతాగడం, సరైన ఆహారం లేకపోవడం వల్ల ఊపిరితిత్తులు బలహీనపడతాయి. అలాంటి పరిస్థితుల్లో కొన్ని సహజమైన పండ్లు మన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి రోజూ ఆహారంలో చేర్చడం మంచిది.

మన శరీరంలోని ప్రతి అవయవం సరిగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం అవసరం. ముఖ్యంగా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సహజమైన ఆహారాలను ప్రతిరోజూ తీసుకోవడం మంచిది. వీటిలో పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని ప్రత్యేకమైన పండ్లు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వాటి పనితీరును బలపరచడంలో సహాయపడతాయి. ఇప్పుడు అలాంటి పండ్ల గురించి తెలుసుకుందాం.
పైనాపిల్
పైనాపిల్‌లో సహజంగా ఉండే బ్రోమెలైన్ అనే పదార్థం శరీరంలో ఏర్పడే ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తుల్లో వాపును నియంత్రించి శ్వాస సంబంధిత ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇందులో ఉండే మాంగనీస్ వంటి ఖనిజాలు కణజాలాలను మరింత బలంగా మార్చుతాయి.
బొప్పాయి
బొప్పాయిలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బొప్పాయి తినడం ద్వారా ఊపిరితిత్తులు పటిష్టంగా మారి వివిధ రకాల ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో శక్తి పొందుతాయి.
కివీ
కివీ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ C, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తూ వాపును తగ్గించడంలో సహాయపడతాయి. కివీని తరచుగా తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో అవి కణజాలాలను రక్షించడంలో సహాయపడతాయి. వీటిలో విటమిన్ C కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. స్ట్రాబెర్రీలు శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి స్వేచ్ఛా రాడికల్స్‌కి చెక్ పెడతాయి.
పుచ్చకాయ
వేసవిలో ఎక్కువగా తినే పుచ్చకాయ కూడా ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్, విటమిన్ C వంటి పోషకాల వల్ల కణజాలాలను ఆరోగ్యంగా ఉంచే అవకాశముంది. పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో తేమ నిలుస్తుంది, వాపు తగ్గుతుంది.
మామిడి
వేసవిలో అందరికి ఇష్టమైన మామిడి పండులో బీటా కెరోటిన్, విటమిన్ A, విటమిన్ C పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఊపిరితిత్తులను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించి వాటి పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది శ్వాసవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
దానిమ్మ
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C, విటమిన్ E వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల కణాలను బలపరిచి, వాతావరణంలో ఉన్న హానికరమైన వాయువుల నుంచి రక్షిస్తాయి. దానిమ్మ తరచూ తినడం వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
బ్లూబెర్రీలు
ఈ చిన్న పండ్లలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శక్తివంతంగా పనిచేస్తాయి. ఇవి కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. బ్లూబెర్రీలు తినడం వల్ల ఊపిరితిత్తుల ఫంక్షన్ బాగా మెరుగవుతుంది ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుంది.
ఆరెంజ్
నారింజ పండులో విటమిన్ C సమృద్ధిగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని వైరస్లు, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతుంది. నారింజ తినడం వల్ల శ్వాస వ్యవస్థ బలంగా మారుతుంది. తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరంగా ఉంటాయి. ఈ పండ్లను ఆహారంలో చేర్చడం వల్ల ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచవచ్చు.