Night Diet: రాత్రి పూట ఆహారం ఎక్కువ తీసుకుంటే ఈ సమస్యలు రావచ్చు.. జర జాగ్రత్త..

భోజన ప్రియులు ఎక్కువమంది మధ్యాహ్నం లంచ్ కంటే రాత్రి పూట డిన్నర్ ని ఇష్టమైన ఆహార పదార్థాలతో కుమ్మేద్దాం అనుకుంటారు. మధ్యాహ్నం ఆఫీసులోనో, లేదా ఏదైనా పనుల మీద ఉండి ఏదో ఒకటి తిని లంచ్..

Night Diet: రాత్రి పూట ఆహారం ఎక్కువ తీసుకుంటే ఈ సమస్యలు రావచ్చు.. జర జాగ్రత్త..
Heavy Food
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 28, 2022 | 1:20 PM

Night Diet: భోజన ప్రియులు ఎక్కువమంది మధ్యాహ్నం లంచ్ కంటే రాత్రి పూట డిన్నర్ ని ఇష్టమైన ఆహార పదార్థాలతో కుమ్మేద్దాం అనుకుంటారు. మధ్యాహ్నం ఆఫీసులోనో, లేదా ఏదైనా పనుల మీద ఉండి ఏదో ఒకటి తిని లంచ్ పూర్తి చేస్తాం. రాత్రి సమయాల్లో ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి.. ఇష్టమైన పదార్థాలతో కొంత పుష్టిగా భోజనం చేస్తాం. కాని రాత్రి పూట ఆహారం పరిమితంగా తీసుకోవాలంటున్నారు డైటీషియన్స్. ఎక్కువుగా లిమిట్ లేకుండా రాత్రి భోజనం చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మన్ డైట్ లో డిన్నర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటే బరువు కూడా తగ్గవచ్చంటున్నారు. రాత్రి భోజనం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

శారీరక వ్యాయామాలు చేసినా చాలా మంది బరువు తగ్గడం లేదని బాధపడుతుంటారు. ఒకవేళ మీరు వ్యాయమం, జిమ్ వంటివి చేస్తున్నా.. బరువు తగ్గడం లేదంటే మన డైట్ సరిగ్గా తీసుకోవడం లేదని అర్థం. డిన్నర్​ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. బరువు మాత్రమే కాకుండా వివిధ ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదముందంటున్నారు. రాత్రి పూట భోజనంలో క్రింది జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

స్వల్పంగా తీసుకోవాలి: అల్పాహారం, భోజనం కంటే రాత్రి భోజనం చాలా తక్కువుగా తీసుకోవాలి అంటున్నారు డైటీషన్లు. రాత్రి భోజనం లిమిట్​గా ఉండేలా చూసుకోమంటున్నారు. ఎందుకంటే రోజు చివరిలో మన జీవక్రియ చాలా మందగిస్తుంది కాబట్టి. ఈ సమయంలో అధిక కొవ్వు, ప్రోసెస్​ చేసిన ఆహారం తింటే.. అది జీర్ణమవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. అంతేకాకుండా ఊబకాయం, షుగర్ వంటి వ్యాదుల బారిన పడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

వీలైనంత త్వరగా రాత్రి భోజనం: రాత్రి 8 గంటలకు ముందే డిన్నర్ చేయాలని చాలామంది డైటీషియన్లు సిఫార్సు చేస్తున్నారు. అంటే.. నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు డిన్నర్ ముగించాలి. డిన్నర్ ఎప్పుడూ లైట్​గానే ఉండాలి. తొందరగా తినాలి కాబట్టి.. ముందుగానే ఫుడ్ రెడీగా ఉండేలా చూసుకోవాలి. ఆఫీస్​లో ఉన్నా.. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా తొందరగా డిన్నర్ ముగించేలా ప్లాన్ చేసుకోవాలి.

ఎలాంటి ఆహారం తినాలి: రాత్రి భోజనంలో ఏమి తీసుకోవాలనే సందేహం చాలామందికి కలుగుతుంది. మొదటిది ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీలైతే వాటిని పూర్తిగా వదిలేయాలి. పిండి పదార్థాలను రాత్రి భోజనంలో తినకూడదు. పప్పులు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి వాటిని తినవచ్చు. జున్ను, చేపలు, చికెన్ వంటి ప్రోటీన్లను తినవచ్చు. సలాడ్ కూడా తినొచ్చు. తద్వారా శరీరానికి ఫైబర్ అందుతుంది. ఇది పొట్టను శుభ్రంగా ఉంచడంలో సహాయంచేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే