Buttermilk Side Effects: ఈ వ్యక్తులు మజ్జిగను అస్సలు తాగకూడదు.. ఎందుకో తెలుసా..

| Edited By: Rajeev Rayala

May 04, 2022 | 2:42 PM

వేసవిలో చల్లదనం కోసం కూల్ డ్రింగ్స్ , నిమ్మరసం ఎక్కువగా తాగేస్తుంటారు. అలాగే నీరు ఎక్కువగా ఉండ పండ్లు, కూరగాయలను తీసుకుంటారు.

Buttermilk Side Effects: ఈ వ్యక్తులు మజ్జిగను అస్సలు తాగకూడదు.. ఎందుకో తెలుసా..
Buttermilk
Follow us on

వేసవిలో చల్లదనం కోసం కూల్ డ్రింగ్స్ , నిమ్మరసం ఎక్కువగా తాగేస్తుంటారు. అలాగే నీరు ఎక్కువగా ఉండ పండ్లు, కూరగాయలను తీసుకుంటారు. అంతేకాకుండా (Buttermilk).. వేసవిలో పెరుగు, మజ్జిగను తీసుకోవడం చాలా మందికి అలవాటు ఉంటుంది. పెరుగు నుంచి మజ్జిగను చేసి నిత్యం తీసుకుంటారు. ఇందులో అనేక పోషకాలున్నాయి. కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి12, మినరల్స్ మొదలైనవి ఉంటాయి. మజ్జిగ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మజ్జిగలో ప్రోబయోటిక్ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది. అలాగే చర్మ సమస్యలను తగ్గించడంలోనూ సహయపడుతుంది. ముఖంపై ముడతలను తగ్గింస్తుంది. అయితే కొందరు వ్యక్తులు మాత్రం మజ్జిగను అస్సలు తినకూడదు.. పొరపాటున తింటే అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడాల్సి వస్తుంది.

జలుబు, దగ్గు..
జలుబు, దగ్గు, గొంతు నొప్పితో బాధపడేవారు మజ్జిగను అస్సలు తీసుకోవద్దు. దీనివలన ఆరోగ్యం మరింత పాడవుతుంది. రాత్రిళ్లు మజ్జిగను తీసుకోవడం మానుకోండి..
మూత్రపిండాలు, తామర..
కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడేవారు మజ్జిగను తీసుకోవద్దు.
కీళ్ల నొప్పులు..
ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు తీసుకోవద్దు.. కీళ్ల నొప్పులు, అర్థరైటిస్, కండరాల నొప్పితో ఇబ్బందిపడేవారు మజ్జిగను తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే కీళ్లలో దృఢత్వం ఏర్పడుతుంది.
గుండె జబ్బులు..
మజ్జిగలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది గుండె జబ్బులతో బాధపడేవారిలో కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ స్థాయిని కలిగి ఉన్న వ్యక్తులు మజ్జిగను తీసుకోవద్దు.
జ్వరం ఉన్నవారు..
మజ్జిగలో కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. జ్వరంలో ఉన్నప్పుడు చల్లవి…పుల్లనివి తీసుకోవద్దు. జ్వరంగా ఉన్నప్పుడు మజ్జిగను తీసుకోవద్దు.
పొడిబారిన చర్మం..
చాలా మంది ముఖానికి మజ్జిగను రాసుకుంటారు. ఇందులో అనేక రకాల యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మానికి సంబంధించిన సమస్యలను కలిగిస్తాయి. దీంతో చర్మంపై మంట, దురద సమస్యలు వస్తాయి. చుండ్రు సమస్యను తగ్గించడానికి చాలా మంది మజ్జిగను ఉపయోగిస్తారు. కానీ ఎక్కువగా ఉపయోగించడం వలన జుట్టు రాలిపోతుంది.

గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల అభిప్రాయాలు, సూచనలు, ఇతర నివేధికల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింద.. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు. సందేహాలకు ముందుగా వైద్యులను సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Liger: అప్పుడే మొదలైన రౌడీ దండయాత్ర.. భారీ ధరకు లైగర్ డిజిటల్ ఆడియో రైట్స్..

Suhasini: భాష వివాదంపై స్పందించిన నటి సుహాసిని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..

Prabhas-Anushka: మరోసారి హిట్ పెయిర్ రిపీట్.. ప్రభాస్ సరసన అనుష్క ?.. ఏ సినిమాలో అంటే..

Viral Photo: ఈ డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు కుర్రాళ్లకు దిల్ క్రష్ ఈ చిన్నది..