AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: అరికాళ్లలో నొప్పా.. రీజన్ అదే.. ఇలా చెక్ పెట్టండి

ఈ వ్యాధిలో అరికాళ్లలో మంట, నొప్పి ఉంటుంది. అరికాళ్లు, చీలమండలు మందంగా మారుతాయి. ఈ సమయంలో, అరికాళ్ళ కణజాలం వాపుగా మారుతుతుంది. దీంతో ఈ ఫాసిటిస్‌ సమస్య మొదలవుతుంది. పాదాలపై ఎక్కువ ఒత్తిడి పడితే ఇలాంటి పరిస్థితి వస్తుంది. అరికాలి ఫాసిటిస్‌కు అనేక కారణాలు ఉంటాయి...

Lifestyle: అరికాళ్లలో నొప్పా.. రీజన్ అదే.. ఇలా చెక్ పెట్టండి
Leg
Ram Naramaneni
|

Updated on: Mar 01, 2024 | 3:07 PM

Share

మనలో చాలా మందికి అరికాళ్లలో అడపాదడపా నొప్పి వస్తుంటుంది. ముఖ్యంగా ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువ దూరం నడవడం లేదా పరిగెత్తే సందర్భాల్లో అరికాళ్లలో నొప్పిగా ఉంటుంది. అయితే ఇది మసాజ్‌ చేయడం ద్వారా ఈ నొప్పి నుంచి బయటపడొచ్చు. అయితే ఎన్నిసార్లు మసాజ్‌ చేసినా నొప్పి తగ్గకుండా, పెరుగుతూనే ఉంటే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. దీనిని చిన్న సమస్యగా భావించి వదిలేయకూడదని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో అరికాళ్లలో నొప్పిగా ఉంటే ఆ సమస్యను.. ‘ప్లాంటర్‌ ఫాసిటిస్‌’గా పిలుస్తారు. ఇంతకీ ప్లాంటర్‌ ఫాసిటీస్‌ అంటే ఏంటి.? ఎలాంటి లక్షణాల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వ్యాధిలో అరికాళ్లలో మంట, నొప్పి ఉంటుంది. అరికాళ్లు, చీలమండలు మందంగా మారుతాయి. ఈ సమయంలో, అరికాళ్ళ కణజాలం వాపుగా మారుతుతుంది. దీంతో ఈ ఫాసిటిస్‌ సమస్య మొదలవుతుంది. పాదాలపై ఎక్కువ ఒత్తిడి పడితే ఇలాంటి పరిస్థితి వస్తుంది. అరికాలి ఫాసిటిస్‌కు అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ సేపు నిలబడి పని చేసే వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అధిక బరువు ఉన్న వారిలో కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే ధరించే చెప్పులు, బూట్ల విషయంలో తప్పులు చేసినా అరికాళ్లలో నొప్పి, గాయాలు, పాదాల పగుళ్లు కూడా పాదాలపై ఒత్తిడి పెరగడానికి కారణమవుతుంది.

ప్లాంటర్‌ ఫాసిటిస్‌లో కనిపించే ప్రధాన లక్షణాలు.. మడమలో నొప్పిగా ఉండడం, చీలమండలు గట్టిగా మారడం, మడమ చుట్టూ వాపు రావడం వంటివి కనిపిస్తాయి. పాదాల నొప్పిని తగ్గించడానికి హీట్ ప్యాడ్‌తో మసాజ్ చేసుకోవాలి. మడమలో తీవ్రమైన నొప్పి ఉంటే, హీట్‌ ప్యాడ్‌ను ఉపయోగించాలి. అందుబాటులో హీట్‌ ప్యాడ్‌ అందుబాటులో ఉండకపోతే.. ఒక బాటిల్‌లో వేడీ నీటిని నింపి దాంతో పాదం చుట్టూ మసాజ్‌ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అలాగే నొప్పి భరించలేనంతగా ఉంటే.. ఒక గుడ్డ తీసుకొని అందులో ఐస్‌ క్యూబ్స్ వేసి అరికాళ్లకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల వెంటనే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక అరికాళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఆక్యుప్రెషర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆక్యుప్రెషర్ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వల్ల కూడా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..