Health: ఫ్లూ, వైరల్ జ్వరం, న్యుమోనియా.. ఈ మూడింటి మధ్య తేడా ఏంటంటే..
అనూహ్యంగా చిన్నారులు న్యూమోనియా బారిన పడుతుండడం, ఆసుపత్రిలన్నీ చిన్నారులతో నిండుతుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సీజన్ ఒక్కసారిగా మారింది. చలికాలంతో పాటు పలు చోట్ల అనూహ్యంగా వర్షాలు కురుస్తుండడంతో...

చైనాలో నమోదవుతోన్న న్యుమోనియో కేసులు ఒక్కసారిగా ప్రపంచాన్ని భయపెడుతోంది. అనూహ్యంగా చిన్నారులు న్యూమోనియా బారిన పడుతుండడం, ఆసుపత్రిలన్నీ చిన్నారులతో నిండుతుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సీజన్ ఒక్కసారిగా మారింది. చలికాలంతో పాటు పలు చోట్ల అనూహ్యంగా వర్షాలు కురుస్తుండడంతో ఫ్లూ, వైరల్ జ్వరాలు, న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి.
ఫ్లూ, వైరల్ ఫీవర్, న్యుమోనియో ఈ మూడింటిలో సహజంగా కనిపించే లక్షణాలు.. దగ్గు, జలుబు, జ్వరం. అయితే మూడింటిలో ఒకే రకమైన లక్షణాలు కనిపించినా కొన్ని సందర్భాల్లో న్యుమోనియా ప్రాణంతకరంగా కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యూమోనియా విషయంలో అశ్రద్ధ చేయొద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. న్యూమోనియాకు సాధారణ ఫ్లూకి మధ్య తేడాలను కొన్ని సింపుల్ తేడాల ద్వారా గుర్తించవచ్చు.
న్యూమోనియా, ఫ్లూ మధ్య తేడా ఏంటంటే..
* ఫ్లూ సోకిన వారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు. కానీ న్యూమోనియోలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఆక్సిజన్ కారణంగా శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది.
* ఫ్లూ సోకిన వారిలో ఛాతీ నొప్పి సమస్య ఉండదు. కానీ న్యూమోనియాలో ఛాతీ తీవ్రంగా బాధిస్తుంది. అలాగే దగ్గుతో పాటు కఫం కూడా వస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.
* న్యూమోనియాల సోకిన వారిలో ఆకలి లేకపోవడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఫ్లూలో మాత్రం చెమటలు పట్టవు.
* సాధారణంగా ఫ్లూ మూడు నుంచి నాలుగు రోజుల్లో దానంతటదే తగ్గిపోతుంది. అయితే బాక్టీరియల్ న్యుమోనియా రోగి పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంది.
న్యూమోనియా, వైరల్ జ్వరం మధ్య తేడా..
వైరల్ జ్వరం వచ్చిన వారిలో శ్వాస సమస్యలు లేదా ఛాతీ నొప్పి రాదు. వైరల్ ఫీవర్ ఎవరికైనా రావచ్చు. అయితే న్యుమోనియా చాలా సందర్భాల్లో పిల్లలు, వృద్ధులలో కనిపిస్తుంది. ఇది రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లలకు ప్రమాదకరంగా మారుతుంది.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..
