Mango: మామిడి తినేసి టెంక పారేస్తున్నారా.? ఈ లాభాలు తెలిస్తే ఇకపై ఆ పని చేయరు..
Mango: వేసవి వచ్చేస్తోంది. అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. అయితే ఇబ్బంది పెట్టే ఈ ఎండల్లోనూ సంతోషానిచ్చే వార్త.. మామిడి పండ్లు అందుబాటులోకి రావడం. నోరురించే వీటి రుచి కోసమైనా సమ్మర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్లు చాలా మంది ఉంటారు..
Mango: వేసవి వచ్చేస్తోంది. అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. అయితే ఇబ్బంది పెట్టే ఈ ఎండల్లోనూ సంతోషానిచ్చే వార్త.. మామిడి పండ్లు అందుబాటులోకి రావడం. నోరురించే వీటి రుచి కోసమైనా సమ్మర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్లు చాలా మంది ఉంటారు. మామిడి పండ్లతో చేసే జ్యూస్, మ్యాంగో ఫ్లేవర్‌తో తయారు చేసే ఐస్‌క్రీమ్స్ ఇలా వీటిని ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. కేవలం రుచే కాకుండా మామిడితో ఆరోగ్యం పరంగా కూడా ఎన్నో లాభాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. అయితే మామిడి పండు తినేసి అందులోని టెంకను పడేస్తుంటాం. కానీ టెంకతో కలిగే లాభాలు తెలిస్తే మాత్రం ఇకపై ఆ పని చేయమన్నా చేయరు. ఇంతకీ మామిడి టెంకతో కలిగే లాభాలపై ఓ లుక్కేయండి..
* ఉబ్బరం, జీర్ణ సంబంధిత ఇబ్బందులతో బాధపడే వారికి మామిడి టెంక మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. మామిడి టెంకను పొడిగా చేసుకొని మజ్జిగలో కలిపి, కాస్త ఉప్పు చేర్చి తాగితే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
* మామిడి టెంకను పొడి చేసుకొని అందులో జీలకర్ర, మెంతుల పొడిని సమానంగా కలపాలి. ఈ పొడిని నిత్యం వేడి వేడి అన్నంతో తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది.
* శ్వాస సంబంధిత వ్యాధులను మామిడి టెంక తగ్గిస్తుంది. టెంకలో ఉన్న గింజను చూర్ణం చేసి రోజుకు మూడు గ్రాముల చొప్పున తేనెతో కలిపి సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. దగ్గు సమస్య తగ్గుతుంది.
* మామిడి టెంకతో చుండ్రు సమస్యకు చెక్ పెట్టొచ్చు. టెంకలోని జీడిని పొడి చేసి దాన్ని మాడుకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ జుట్టుకు పోషణ అందిస్తాయి.
* తెల్ల వెంట్రుకలకు కూడా మామిడి టెంక ఉపయోగపడుతుంది. మామిడి టెంక పొడిలో కొబ్బరి, ఆలీవ్, ఆవనూనెలు కలిపి వెంట్రుకలకు పట్టించాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
* మామిడి టెంక పొడిలో వెన్న కలిపి చర్మానికి రాసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.
నోట్: మామిడి టెంకతో లాభాల గురించి తెలిపిన ఈ వివరాలు ప్రాథమిక సమాచారం ఆధారంగా మాత్రమే అందించడం జరిగింది. అయితే ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ వివరాలపైనే పూర్తిగా ఆధారపడకుండా వైద్యుల సలహాలు తీసుకోవడమే సూచించదగిన అంశం.
Gas Prices: కేంద్రం ఆ పని చేయనందునే ఆకాశానికి గ్యాస్ ధరలు .. ఆందోళనలో పరిశ్రమ వర్గాలు..