AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Prices: కేంద్రం ఆ పని చేయనందునే ఆకాశానికి గ్యాస్ ధరలు .. ఆందోళనలో పరిశ్రమ వర్గాలు..

Gas Prices: పెట్రోల్​, డీజిల్​ ధరలతో పాటు గ్యాస్ రేట్లు పెరగటం ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్రం వాటిని పట్టించుకోకపోవటం వల్ల అధిక ధరలకు దిగుమతి చేసుకోవలసి వస్తోందని పంపిణీ సంస్థలు చెబుతున్నాయి.

Gas Prices: కేంద్రం ఆ పని చేయనందునే ఆకాశానికి గ్యాస్ ధరలు .. ఆందోళనలో పరిశ్రమ వర్గాలు..
Gas Rates
Ayyappa Mamidi
|

Updated on: Apr 17, 2022 | 6:04 PM

Share

Gas Prices: దేశీయ గ్యాస్ క్షేత్రాల నుంచి సిటీ గ్యాస్​ పంపిణీ విభాగాలకు డిమాండ్​కు తగినట్లుగా కొత్త కేటాయింపులు చేయకపోవటం వల్ల కంప్రెస్డ్​ నేచురల్​ గ్యాస్​ (CNG), పైప్డ్​ కుకింగ్​ గ్యాస్​(PNG) ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్​, డీజిల్​ ధరలతో పాటు గ్యాస్ రేట్లు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. సిటీ గ్యాస్​ పంపిణీ(CGD) విభాగాలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా 100 శాతం గ్యాస్​ సరఫరా చేయాలన్న కేంద్ర కేబినేట్​ నిర్ణయానికి విరుద్ధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం 2021, మార్చి నాటి డిమాండ్​కు తగినట్లుగా గ్యాస్​ సరఫరా జరుగుతోంది. దీంతో ఇప్పటి డిమాండ్​ను చేరుకునేందుకు సిటీ గ్యాస్​ ఆపరేటర్లు అధిక ధరకు దిగుమతి చేసుకున్న ఎల్​ఎన్​జీని కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఏటా ఆరు నెలలకోసారి డిమాండ్​కు తగినట్లుగా నేచురల్​ గ్యాస్​ కేటాయింపులు కేంద్రం సవరిస్తుంది. అయితే.. పంపిణీ కేంద్రాలకు గ్యాస్​ సరఫరా నిలిపివేయలేదని, అదనంగా కేటాయింపులు చేస్తే విద్యుత్తు, ఎరువులు వంటి కీలక పరిశ్రమలకు సరఫరాలో కోత పడుతుందని ఇంధన మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కేంద్రం నిర్లక్ష్యంతోనే..

డిమాండ్​కు తగినట్లుగా ప్రతి మూడు నెలలకోసారి గ్యాస్​ కేటాయింపులు సవరించాలని, గడిచిన రెండు నెలల డిమాండ్​ను పరిగణనలోకి తీసుకోవాలని సీజీడీ ఆపరేటర్లు కేంద్రాన్ని కోరుతున్నారు. వారి వినతులను పట్టించుకోని కేంద్రం ఏడాదిగా ఎలాంటి కొత్త కేటాయింపులు చేయలేదని పంపిణీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే.. అలా చేస్తే కీలక పరిశ్రమలకు కోత విధించాల్సి వస్తుందని ఇంధన శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. డిమాండ్​కు తగినంతగా కేటాయింపులు లేకపోవటం వల్ల వీటి​ ధరలు 110 శాతం పెరిగాయి. ధరల మార్పు విధానం(ఏపీఎం) ప్రకారం సీఎన్​జీ, పీఎన్​జీ ధరలు మిలియన్​ బ్రిటీష్​ థర్మల్​ యూనిట్​కు 2.90 అమెరికా డాలర్ల నుంచి 6.10 డాలర్లకు చేరుకున్నాయి. సరిపడా కేటాయింపులు లేకపోవటం వల్ల దేశీయ ధరలకు ఆరు రెట్లు అధికంగా ఉన్న ఇంపోర్టెడ్​ లిక్విఫైడ్​ నేచురల్​ గ్యాస్​ (ఎల్​ఎన్​జీ)ను కొనుగోలు చేయాల్సి వస్తొంది. దీని వల్ల ఏడాదిలో సీఎన్​జీ, పీఎన్​జీ కిలోకు ధర 60 శాతం లేదా రూ.28 పెరిగింది. ఇది గ్యాస్​ పంపిణీ సంస్థల నిర్వహణకు ప్రశ్నార్థకంగా మారిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు.. కొత్త నగరాలకు గ్యాస్​ సరఫరా చేసేందుకు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులన్న లక్ష్యాన్ని వెనక్కి నెడుతోందన్నారు. పర్యావరణ హిత నేచురల్​ గ్యాస్​ వినియోగాన్ని 2030 నాటికి 15 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కేటాయింపులు ముఖ్యమని పంపిణీ సంస్థలు చెబుతున్నాయి. కేంద్రం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది.

ఏప్రిల్​ 14న సీఎన్​జీ, పీఎన్​జీ గ్యాస్​ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. దిల్లీలో కిలో సీఎన్​జీపై రూ.2.50, పీఎన్​జీపై రూ.4.25 పెంచింది. దీంతో ప్రస్తుతం దేశంలో సీఎన్​జీ గ్యాస్​ ధర కిలోకు దిల్లీలో రూ.71.61, ముంబయిలో రూ.72గా ఉంది. డిమాండ్​ను చేరుకునేందుకు ఎల్​ఎన్​జీని కొనుగోలు చేస్తే వాటి ధరలు రూ.100-105కు చేరుకుంటాయి.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

GST Rates: సామాన్యులపై రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారం మోపనున్నాయా.. జీఎస్టీ రేట్ల పెంపు తప్పదా..?

Sri Lanka Crisis: కష్టాల కొలిమిలో లంక.. తాజాగా 5 రోజుల పాటు స్టాక్ మార్కెట్ బంద్.. ఎందుకంటే..