AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka Crisis: కష్టాల కొలిమిలో లంక.. తాజాగా 5 రోజుల పాటు స్టాక్ మార్కెట్ బంద్.. ఎందుకంటే..

Sri Lanka Crisis: శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. ఇప్పటికే కొంతకాలం పాటు ఇతర దేశాల అప్పులను చెల్లించలేమని ఆ దేశం ఇటీవల ప్రకటించింది. ఇదిలా ఉండగా.. శ్రీలంక ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీ అయిన కొలంబో స్టాక్ ఎక్స్ఛేంజ్ సేవలు నిలిపివేయనుంది.

Sri Lanka Crisis: కష్టాల కొలిమిలో లంక.. తాజాగా 5 రోజుల పాటు స్టాక్ మార్కెట్ బంద్.. ఎందుకంటే..
Srilanka
Ayyappa Mamidi
|

Updated on: Apr 17, 2022 | 4:49 PM

Share
Sri Lanka Crisis: శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. ఇప్పటికే కొంతకాలం పాటు ఇతర దేశాల అప్పులను చెల్లించలేమని ఆ దేశం ఇటీవల ప్రకటించింది. ఇదిలా ఉండగా.. శ్రీలంక ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీ అయిన కొలంబో స్టాక్ ఎక్స్ఛేంజ్(Colombo Stock Exchange) ఏప్రిల్ 18 నుంచి 22 వరకు తాత్కాలికంగా ఐదు రోజుల పాటు మూసివేయాలని సెక్యూరిటీస్‌ ఎక్సేంజ్‌ కమిషనర్‌ శనివారం ప్రకటించింది. శ్రీలంకకు చెందిన సెక్యూరిటీస్ కమీషన్ కొలంబో స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు  దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చింది. దేశ ఆర్థిక పరిస్థితులను(Financial Emergency) దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశంలో నెలకొన్ని ఆర్థిక గడ్డు పరిస్థితులపై ఇన్వెస్టర్లకు ఒక అవగాహన ఏర్పడుతుందని ఎస్‌ఈసీ అభిప్రాయ పడింది. ఇప్పటికే వివిద దేశాలు, అంతర్థాతీయ ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన సుమారు 8 బిలియన్‌ డాలర్ల రుణాలు చెల్లించలేమంటూ అక్కడి ప్రభుత్వం చేతులెత్తేసింది. మరోవైపు ఆర్థికంగా తమ దేశాలను ఆదుకోవాలనే విజ్ఞప్తులు సైతం చేస్తోంది. మరోవైపు ఈ సంక్షోభానికి కారణమైన ప్రభుత్వం దిగిపోవాలంటూ ప్రతిపక్షాలు, పౌరులు నిర్విరామంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

దేశంలోని పరిస్ధితులను గాడిన పెట్టేందుకు లంక నిధుల సమీకరణకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ఇతర రుణదాతల నుంచి 4 బిలియన్ డాలర్ల సహాయం కోసం శ్రీలంక ప్రతినిధి బృందం వాషింగ్టన్‌ను ఆశ్రయించింది. ఈ కారణంగా శ్రీలంకలో ఆహారం, ఇంధనం కొరత ఏర్పడింది. ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కూడా ఏర్పడింది. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. 81 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన ఈ దేశం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడింది. నిత్యావసర వస్తువులు, ఇంధనం దిగుమతి కోసం ఫారెక్స్‌ను ఆదా చేసేందుకు ప్రభుత్వం ఇతర దేశాలకు, రుణాల చెల్లింపులను కొంతకాలం నిలిపివేసింది. కానీ ఇవి అక్కడి సంక్షోభాన్ని పూర్తిగా అరికట్టేందుకు సరిపోవటం లేదు.

శ్రీలంక ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్రోలియం కంపెనీ వాహనాలకు ఇంధన కోటాను నిర్ణయించినట్లు ప్రకటించింది. సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (CPC) ప్రకటన ప్రకారం.. ఇప్పుడు మోటార్‌సైకిళ్లు, ఇతర ద్విచక్ర వాహనాలు ఏ ఇంధన స్టేషన్‌లోనైనా రూ.1,000 వరకు మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మూడు చక్రాల వాహనాలు రూ.1500, కార్లు, జీపులు, వ్యాన్‌లు రూ.5వేలకు ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు. బస్సులు, లారీలు, వాణిజ్య వాహనాలకు మాత్రం ఈ కోటా విధానం నుంచి మినహాయింపు ఉంది. చమురు కోసం మరో 500 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ గురించి భారతదేశంతో చర్చలు జరుపుతున్నామని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (CPC) ఛైర్మన్ వెల్లడించారు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Economic crises: భారత్ చుట్టూ ముదురుతున్న సంక్షోభం.. ఇవి మన దేశంపై ప్రభావం చూపుతాయా..

Forex Reserves: భారత్ వద్ద వేగంగా కరిగిపోతున్న ఫారెక్స్ నిల్వలు.. వరుసగా ఐదోవారంలోనూ ఎందుకంటే..