Assam Congress: అస్సాం కాంగ్రెస్‌కు భారీ షాక్.. పార్టీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరిన మాజీ పీసీసీ చీఫ్ రిపున్ బోరా!
కాంగ్రెస్ సీనియర్ నేత రిపున్ బోరా ఆ పార్టీకి రాజీనామా చేశారు. అస్సాం మాజీ ఎంపీ, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రిపున్ బోరా తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు
Assam Congress: కాంగ్రెస్ సీనియర్ నేత రిపున్ బోరా(Ripun Bora) ఆ పార్టీకి రాజీనామా చేశారు. అస్సాం మాజీ ఎంపీ, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రిపున్ బోరా తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)కి పంపించారు. “బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే బదులు, అస్సాం కాంగ్రెస్‌లోని ఒక వర్గం సీనియర్ నాయకులు బీజేపీ ప్రభుత్వంతో ప్రధానంగా ముఖ్యమంత్రితో రహస్య ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.” అస్సాంలో పార్టీ మనుగడ ఇక కష్టం. అందుకే రాజీనామా చేస్తున్నానంటూ పేర్కొన్నారు. అనంతరం ఆయన పార్లమెంటు సభ్యులు అభిషేక్ బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేరారు.
విద్యార్థి జీవితం నుంచి 1976 నుంచి కాంగ్రెస్‌తో అనుబంధం ఉందని రిపున్ బోరా తన రాజీనామాలో రాశారు. పార్టీలో వివిధ పదవులు నిర్వహించి ఈరోజు బరువెక్కిన మనసుతో పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నాపై విశ్వాసం ఉంచినందుకు, కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సోనియా గాంధీకి రాసిన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా భారతీయ జనతా పార్టీ మత విభజనకు చిహ్నంగా మారిందని, అది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, లౌకికవాదానికి, ఆర్థిక వ్యవస్థకు, దేశానికి పెను ముప్పు అని రాజీనామా చేస్తూనే చెప్పాలనుకుంటున్నానని వెల్లడించారు.
Congress leader Ripun Bora tenders his resignation from the party. pic.twitter.com/wH8BGJYKWe
— ANI (@ANI) April 17, 2022
పార్టీ అంతర్గత పోరు అంశాన్ని లేవనెత్తిన ఆయన.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే బదులు పార్టీలోని పలువురు నేతలు తమ కోసం ఒకరిపై ఒకరు పోరుకు దిగుతున్నారని అన్నారు. దీనివల్ల బీజేపీ లాభపడుతుండగా, కాంగ్రెస్ ఆధిక్యతకి దిగజారింది. ఇది లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తోంది. వీటన్నింటి మధ్యలో నా స్వంత రాష్ట్రం మినహాయింపు కాదు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అస్సాం పీసీసీ అధ్యక్ష బాధ్యతలను మీరు నాకు అప్పగించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశాను. పంచాయితీ, ఉప ఎన్నిక, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ సవాల్ విసిరింది. అయినప్పటికీ గట్టి పోటీ ఇచ్చామని రిపున్ బోరా పేర్కొన్నారు.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అధికారం దక్కుతుందని ప్రజలు భావించారు. కానీ అంతర్గత పోరుతో కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. దీని కారణంగా ప్రజలు మాకు పార్టీని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వలేదంటూ సోనియాకు రాజీనామా లేఖలో రిపున్ బోరా పేర్కొన్నారు.
Read Also… Imran Khan: నేను భారత్, అమెరికాకు వ్యతిరేకం కాదు.. నాకు అందరి స్నేహం కావాలిః ఇమ్రాన్ ఖాన్