Diabetes: మీకు షుగర్ ఉందని చెప్పే లక్షణాలు ఇవే.. వెంటనే అలర్ట్ అవ్వాలి..
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇబ్బందిపడుతోన్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా డయాబెటిస్ వ్యాధిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే అంత సులభంగా వదలదు...

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇబ్బందిపడుతోన్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా డయాబెటిస్ వ్యాధిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే అంత సులభంగా వదలదు. ఎన్ని రకాల మెడికేషన్ తీసుకున్నా జీవన విధానంలో మార్పులు చేసుకుంటే తప్ప డయాబెటిస్ తగ్గదు. అయితే డయాబెటిస్‌కు ముందుగానే గుర్తిస్తే కంట్రోల్ చేసుకోవడం సులభమవుతుంది. కొన్ని లక్షణాల ద్వారా డయాబెటిస్‌ను ముందుగానే గుర్తించవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* షుగర్ వ్యాధి ప్రారంభ లక్షణాల్లో నోరు పొడిబారటం ఒకటి. దీంతో దాహం ఎక్కువగా ఉంటుంది. కాలంతో సంబంధం లేకుండా నిత్యం దాహం వేస్తుంటే అది షుగర్ వ్యాధికి ప్రారంభ లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.
* షుగర్ వ్యాధిని ముందుగా గుర్తించే లక్షణాల్లో అతి మూత్రం ప్రధానమైంది. పదే పదే మూత్ర విసర్జన వస్తున్న భావన కలుగుతుంటే వెంటనే అలర్ట్ కావాలని నిపుణులు చెబుతున్నారు.
* సరిపడా ఆహారం తీసుకున్నా నిత్యం నిస్సత్తువతో ఉన్నా, ఎల్లప్పుడూ శక్తిటేన్లు నీరసంగా ఉంటే అది కూడా షుగర్ వ్యాధికి ముందస్తు లక్షణంగా భావించాలని సూచిస్తున్నారు. వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.
* రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే చర్మంపై దురద లక్షణం కనిపిస్తుంది. అనుకోకుండా చర్మంపై దురద వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
* షుగర్ వ్యాధి జీర్ణక్రియపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో తరచూ ఆకలి అవుతున్న భావన కలుగుతుంది. ఇలాంటి భావన కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
* డయాబెటిస్ బారిన పడితే శరీరంపై గాయాలు త్వరగా మానవు. ఒకవేళ శరీరంపై ఏదైనా గాయం త్వరగా తగ్గకపోతే అది షుగర్ వ్యాధికి ముందస్తు లక్షణంగా భావించాలి.
* ఎలాంటి కారణం లేకున్నా ఉన్నపలంగా బరువు తగ్గితే కూడా అప్రమత్తం కావాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా బరువు తగ్గితే అది డయాబెటిస్‌కు లక్షణంగా భావించాలని చెబుతున్నారు.
* కాళ్లలో స్పర్శ తగ్గినా, కాళ్లలో తిమ్మిర్లు ఎక్కువైనా కూడా డయాబెటిస్ లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* ఇక మరికొందరిలో రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగితే తరచూ ఆయాసం, వాంతులు, విరేచనాలు, చర్మం, మర్మాయవయాల వద్ద ఇన్ఫెక్షన్లు వంటివి కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినా షుగర్‌కు ముందుస్తు లక్షణంగా భావించాలని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..
