Summer Diet: ఈ హాట్ సమ్మర్‌లో కూల్‌గా ఉండాలంటే ఇలా చేయండి.. మీ ఆరోగ్యం మీ చేతిలో..
మారుతున్న వాతావరణం ప్రభావం మన ఆహారపు అలవాట్లపై స్పష్టంగా కనిపిస్తుంది. వేడి పెరిగింది.. శరీరం నుంచి చెమట రావడం మొదలైంది. అటువంటి వాతావరణంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం.
మారుతున్న వాతావరణం ప్రభావం మన ఆహారపు అలవాట్లపై స్పష్టంగా కనిపిస్తుంది. వేడి పెరిగింది.. సూర్యారావు(Summer) తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టాడు. శరీరం నుంచి చెమట రావడం మొదలైంది. అటువంటి వాతావరణంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. మారుతున్న సీజన్‌లో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలంటే కేవలం నీటిని తీసుకుంటే సరిపోదు.. ఆహారంలో కొన్ని పండ్లు, పానీయాలు తీసుకోవడం కూడా అవసరం. ఆహారంలో పండ్ల రసాలను తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి కొరత నెరవేరుతుంది. అలాగే కండరాలు, కీళ్ళు కూడా బాగా పని చేస్తాయి. వేసవిలో చెమట ఎక్కువగా ఉంటుంది, దీని కారణంగా శరీరంలో డీహైడ్రేషన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల చర్మ సమస్యలు, తలనొప్పి కూడా రావచ్చు. మారుతున్న సీజన్‌లో చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, అలాగే వేడిని నియంత్రించడానికి, శరీరంలో నీటి కొరతను తీర్చే ఆహారంలో కొన్ని ఆహారాలను తీసుకోవడం అవసరం. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచే అలాంటి ఐదు ఆహారాల గురించి తెలుసుకుందాం.
సీజనల్ ఫ్రూట్స్ తినండి: వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి వేసవిలో దొరికే అన్ని పండ్లూ మేలు చేస్తాయి. పుచ్చకాయ వంటి పండ్లు శరీరాన్ని వేడి నుంచి కాపాడుతాయి. అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.
పుదీనా తినండి : వేసవిలో పుదీనా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి. చల్లని ప్రభావం పుదీనా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా చక్కగా ఉంటుంది.
కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది: ప్రతి సీజన్‌లో కొబ్బరి నీళ్లను తీసుకోవడం చాలా మంచిది. కొబ్బరి నీరు వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటు శరీరానికి శక్తిని ఇస్తుంది. ఎలక్ట్రోలైట్ సమృద్ధిగా ఉండే కొబ్బరి నీరు వేసవిలో శరీరంలో నీటి కొరతను తీర్చడమే కాకుండా వేడి నుండి రక్షిస్తుంది.
ఇవి కూడా చదవండి: CM Yogi: ఏయ్ బిడ్డా.. ఇది యూపీ గడ్డ.. యోగి అడ్డా.. 37 ఏళ్ల చరిత్రను తిరగరాసిన బీజేపీ..
G Kishan Reddy: బీజేపీ గెలుపు వెనుక ఆ తెలుగోడు.. గోవాలో చక్రం తిప్పిన కిషన్ రెడ్డి..