Cholesterol: చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతున్నాయని తెలిపే సంకేతాలివి.. ముఖంపై ఈ లక్షణాలుంటే వెంటనే అలర్టవ్వండి..
బిజీ జీవనశైలి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, అధిక కొలెస్ట్రాల్ సమస్య సర్వసాధారణంగా మారుతోంది. చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యలు గుండెను మాత్రమే ప్రభావితం చేస్తాయని అనుకుంటారు, కానీ దాని ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుందని మీకు తెలుసా? ఈ సంకేతాలను సకాలంలో గుర్తించకపోతే, అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణుల చెప్తున్నారు.

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, అలసట, ఛాతీ నొప్పి వంటివి. అయితే, చర్మంపై అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు కనిపించినప్పుడు, అది ఆరోగ్య ప్రమాదాల గురించి ముందస్తు హెచ్చరికగా గుర్తించాలి. ఈ లక్షణాలను సకాలంలో గుర్తిస్తే, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు. బిజీ జీవనశైలి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్య ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. చాలా మంది దీనిని గుండె సమస్యగానే భావిస్తారు, కానీ దాని ప్రభావం చర్మంపై కూడా స్పష్టంగా కనిపిస్తుందని తెలుసా? మీ చర్మంపై ఈ మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి. ఇవి మీ కొలెస్ట్రాల్ స్థాయిలు ప్రమాదకర స్థాయిని దాటాయని సూచించే 5 సంకేతాలు కావచ్చు.
1. కళ్ళ దగ్గర మచ్చలు
కళ్ళ చుట్టూ లేదా కనురెప్పలపై చిన్న పసుపు రంగు మచ్చలు కనిపిస్తే, అది అధిక కొలెస్ట్రాల్ ఉనికిని సూచిస్తుంది. ఈ మచ్చలను జాంథెలాస్మా అంటారు. ఇవి బాధాకరం కాకపోయినా, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగాయని తెలియజేస్తాయి. కాలక్రమేణా ఈ మచ్చలు పరిమాణంలో పెరగవచ్చు, కాబట్టి వీటిని గమనించిన వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది.
2. చేతులు, కాళ్ళపై వాక్సీ గడ్డలు
మీ చర్మంపై చిన్న పసుపు లేదా వాక్సీ దద్దుర్లు లేదా గడ్డలు కనిపిస్తే, అది శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోవడాన్ని సూచిస్తుంది. దీనిని జాంతోమా అంటారు. ఈ గడ్డలు సాధారణంగా మోచేతులు, మోకాళ్ళు, చేతులు, కళ్ళు పాదాలపై కనిపిస్తాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తుల్లో తరచుగా ఏర్పడతాయి. గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని సూచిస్తాయి.
3. దురద వాపు చర్మం
ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా మీ చర్మం ఎర్రగా మారి, దురదగా లేదా వాపుగా అనిపిస్తే, అది చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) అధికంగా ఉండటం వల్ల కావచ్చు. అధిక కొలెస్ట్రాల్ రక్త ప్రవాహానికి అడ్డంకులు సృష్టిస్తుంది, దీని వల్ల చర్మ కణాలకు తగినంత ఆక్సిజన్ అందక, దురద దద్దుర్లు వస్తాయి. ఈ లక్షణం చర్మ సమస్య కంటే లోతైన ఆరోగ్య సమస్యను సూచిస్తుంది.
4. గాయాలు నెమ్మదిగా మానడం
మీ పాదాలు ఎల్లప్పుడూ చల్లగా అనిపిస్తున్నాయా లేదా చిన్న గాయాలు కూడా మానడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నాయా? అధిక కొలెస్ట్రాల్ రక్త సిరల్లో ప్లాక్ ఏర్పడటానికి కారణమవుతుంది, ఇది రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీని వల్ల చేతులు, కాళ్ళు చల్లగా అనిపించడంతో పాటు గాయాలు నయం కావడం ఆలస్యమవుతుంది. చర్మం లేదా గోళ్ల రంగు మార్పు కూడా ఈ సమస్య యొక్క సంకేతంగా ఉంటుంది.
5. గోళ్ల రంగులో మార్పు
మీ గోళ్లు లేత పసుపు లేదా నీలం రంగులోకి మారుతున్నాయా? ఇది అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్త ప్రసరణ సరిగా జరగకపోవడాన్ని సూచిస్తుంది. రక్తం సరిగా ప్రవహించకపోతే, గోళ్లు చర్మానికి తగిన పోషణ అందదు, దీని వల్ల అవి బలహీనంగా రంగు మారినట్లుగా కనిపిస్తాయి. ఈ లక్షణం గమనించినప్పుడు వెంటనే శ్రద్ధ వహించాలి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు.