Tea Types: ‘టీ’లో రకాలు.. ఆరోగ్యానికి ఎన్ని విధాలుగా ప్రయోజనాలో మీకు తెలుసా?..

Tea Types: ‘టీ’.. ఉదయాన్నే కాసింత వేడి వేడి తేనీరు కడుపులో పడందే ఊపిరి సలపదు. చాలామంది బెడ్ టీ, బెడ్ కాఫీ అని తాగేస్తుంటారు.

Tea Types: ‘టీ’లో రకాలు.. ఆరోగ్యానికి ఎన్ని విధాలుగా ప్రయోజనాలో మీకు తెలుసా?..
Tea
Follow us

|

Updated on: Oct 05, 2021 | 10:01 AM

Tea Types: ‘టీ’.. ఉదయాన్నే కాసింత వేడి వేడి తేనీరు కడుపులో పడందే ఊపిరి సలపదు. చాలామంది బెడ్ టీ, బెడ్ కాఫీ అని తాగేస్తుంటారు. కాస్త తలపోటుగా అనిపించినా.. వెంటనే స్టౌ ఆన్‌చేసి గరగరం చాయ్‌ని తాగేస్తుంటారు. ‘టీ’కి ఉండే ప్రాధాన్యత అలాంటిది. లేబర్ వర్కర్ మొదలు.. కార్యాలయాల్లో పెద్ద పెద్ద ఉద్యోగుల వరకు టీ తాగనిదే పని ముందుకు కదలని పరిస్థితి ఉంటుంది. అంతలా బాడీని రిఫ్రెష్ చేస్తుంది టీ. అందుకే.. అందరూ టీ తాగేందుకు చాలా ఆసక్తి చూపుతారు. అయితే, టీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ‘టీ’లో అనేక రకాలు ఉన్నాయని, రకరకాల టీ లతో.. రకరకాల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. సాధారణంగా బ్లాక్, గ్రీన్, ఊలాంగ్, పు-ఎర్త్, వైట్ టీలు నిజమైన టీ లు అని, ఇవన్నీ టీ ఆకుల నుంచి తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని సాంకేతికంగా కామెల్లియా సినెన్సిస్ ప్లాంట్ అని పిలుస్తారని అంటున్నారు. అయితే, కామెల్లియా సైనెన్సిస్ నుండి తయారు చేయని టీ లను.. ‘మూలికా టీ’ లు అంటారు. వీటిలో చమోమిలే, పుదీనా, మందార, రూయిబోస్ వంటి టీ లు ముఖ్యమైనవి.

అయితే, ‘టీ’ లో ఎన్నిరకాలున్నా.. అవన్నీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవక్రియ రేటును పెంచి.. శరీర బరువును తగ్గించడంలో ఉపకరిస్తాయని చెబుతున్నారు. అంతేకాదు.. హృదయాన్ని పదిలాంగా ఉంచుతాయట. యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల అవి చర్మ సంబంధమైన అనారోగ్య సమస్యలను నివారిస్తాయట. మరి ‘టీ’ రకాలు.. వాటివలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. బ్లాక్ టీ.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలు కలిగి ఉంటాయి. దీని కారణంగా శరీరం, ముఖంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని చెబుతున్నారు.

2. గ్రీన్ టీ.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో కొవ్వు తగ్గడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది చర్మ సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది. దద్దుర్లు, ర్యాషెస్ రాకుండా కాపాడుతుంది.

3. ఊలాంగ్ టీ.. ఈ టీ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రక్తపోటు, బరువు తగ్గడం, నిద్రను మెరుగుపరచడం, ఇన్‌ఫ్లమేటరీ ప్రేగు వ్యాధులు మొదలైనవాటిని తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. ఇది యాంటీ-అలెర్జీని కలిగి ఉంటుంది. తామర వంటి చర్మ సమస్యలను నయం చేస్తుంది.

4. పు-ఎర్త్ టీ.. ఈ టీ శారీరక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన హృదయాన్ని ప్రోత్సహిస్తుంది. టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్‌ను శుభ్రపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది చర్మం స్థితిస్థాపకతను నిర్వహిస్తుంది. వృద్ధాప్యా చాయలు కనిపించకుండా చూస్తుంది.

5. వైట్ టీ.. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వృద్ధాప్య చాయలు రాకుండా ఉపకరిస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇక చమోమిలే, లావెండర్ టీ నిద్రలేమి చికిత్సలో సహాయపడతాయి. మందార, బ్లూ పీ బటర్‌ఫ్లై ‘టీ’లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి చాలా మంచిచేస్తుంది. పుదీనా, అల్లం టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Also read:

Zodiac Signs: ఇతరులతో ఇట్టే కలిసిపోతారు.. ఈ నాలుగు రాశుల వారి ప్రత్యేకతే వేరు..

Aryan Khan drug case: ఆర్యన్‌ఖాన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మూడ్రోజుల కస్టడీ..

Tea Types: ‘టీ’లో రకాలు.. ఆరోగ్యానికి ఎన్ని విధాలుగా ప్రయోజనాలో మీకు తెలుసా?..