AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Tree Oil Benefits: వందేళ్ళ క్రితం నుంచి స్కిన్ కండిషనర్ గా వాడుతున్న టీ ట్రీ ఆయిల్ వలన ఎన్ని ఉపయోగాలో తెలుసా

Tea Tree Oil Benefits: టీ ట్రీ ఆయిల్ ఈ మాటను మనం చర్మ సౌందర్యానికి సంబంధించిన యాడ్స్ వచ్చే సమయంలో వింటూనే ఉన్నాం..అయితే పేరు లో టీ ఉంది కానీ దీనిని తేనీరు..

Tea Tree Oil Benefits: వందేళ్ళ క్రితం నుంచి స్కిన్ కండిషనర్ గా వాడుతున్న టీ ట్రీ ఆయిల్ వలన ఎన్ని ఉపయోగాలో తెలుసా
Tea Tree Oil
Surya Kala
|

Updated on: Jul 08, 2021 | 9:20 PM

Share

Tea Tree Oil Benefits: టీ ట్రీ ఆయిల్ ఈ మాటను మనం చర్మ సౌందర్యానికి సంబంధించిన యాడ్స్ వచ్చే సమయంలో వింటూనే ఉన్నాం..అయితే పేరు లో టీ ఉంది కానీ దీనిని తేనీరు ఏ మాత్రం సంబంధం లేదు.. ఈ నూనెను మెలాల్యుకా అల్టెర్నోఫోలియా మొక్క నుంచి తయారు చేస్తారు. ఎక్కువగా ఆస్ట్రేలియాలో దొరుకుతాయి ఈ మొక్కలు. ఈ టీ ట్రీ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఈ ఆయిల్ ను సుమారుగా వందేళ్ళ క్రితం నుంచి స్కిన్ కండిషనర్ గా వాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న ఈ టీ ట్రీ ఆయిల్ ఉపయోగాల గురించి తెలుసుకుందాం

*చర్మం కాంతివంతంగా కావడానికి ముఖం పై ఉన్న మొటిమలు, మచ్చలు పోవడానికి టీ ట్రీ ఆయిల్ కంటే మెరుగైనది ఏమీ లేదు. మొటిమలను తగ్గించే చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉండాలంటే.. టీ ట్రీ ఆయిల్ బెస్ట్. టీ ట్రీ ఆయిల్ 2-3 చుక్కలను తీసుకుని దానిలో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ పెరుగు కలపాలి. వీటిని మిస్క్ చేసి ఆ మిశ్రమాన్ని వేళ్ళ కొనతో మీ ముఖంపై అప్లై చేసి.. ఒక 15 నిముషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. *మూత్రాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో టీ ట్రీ ఆయిల్ ఉపయోగపడుతుంది. మూత్రాశయ, మూత్ర పిండాల సమస్యలకు కారణమైన బ్యాక్టీరియాను అదుపు చేయడంలో టీ ట్రీ ఆయిల్ మంచి సహాయకారి. స్నానం చేసే ముందు నీటిలో పది చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను కలపండి. ఆ నీటితో స్నానం.. చేస్తే.. మూత్రం యొక్క మార్గం దగ్గర ఉండే బ్యాక్టీరియాను క్లియర్ చేస్తుంది. *కొంతమంది శరీరం చెమటతో దుర్వాసన వస్తుంది. అటువంటి వారు ఈ టీ ట్రీ ఆయిల్ ప్రోడక్ట్స్ వాడితే.. ఆ దుర్వాసన నుంచి బయటపడొచ్చట. *ఫంగస్ వలన గోరుచుట్టు ఏర్పడుతుంది. ఈ గోరుచుట్టు నుండి ఉపశమనం పొందడానికి యాంటీమైకోటిక్ లక్షణాలున్న టీ ట్రీ ఆయిల్ సహాయపడుతుంది. వేడి నీటిలో 2 టీ స్పూన్ పసుపు తో పాటు రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్ వేయాలి. ఆ నీటిలో గోరుచుట్టు ఉన్న వేళ్ళను 20 నిమిషాలు ఉంచితే మంచి ఫలితం ఉంటుంది * దంత క్షయం, నోటి దుర్వాసన తో ఇబ్బంది పడేవారికి టీ ట్రీ ఆయిల్‌ మంచి సహాయకారి. దీనిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒక కప్పు వేడి నీటిలో రెండు మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి ఉదయాన్నేమింగకుండా పుక్కిలించాలి. *చర్మ సంబంధమైన వ్యాధి తామర తో ఇబ్బంది పడేవారు ఆ ప్రదేశంలో క్రమం తప్పకుండా టీ ట్రీ ఆయిల్ రాస్తుంటే.. మంచి ఫలితం ఉంటుంది. *పొడి చర్మాన్ని నయం చేయడానికి, ఏదైనా పురుగు కుట్టిన ప్రదేశంలో దురద దద్దుర్లు ఏర్పడిన టి ట్రీ ఆయిల్ నయం చేస్తుంది, ఈ టీ ట్రీ ఆయిల్ అన్ని రకాల చర్మాలకూ పనిచేస్తుందని నిపుణులు తెలిపారు. కాకపోతే… వాడే ముందు ఓసారి కొద్దిగా చర్మంపై రాసుకొని టెస్ట్ చేసుకుంటే మంచిదే అంటున్నారు. అంతేకాదు ఈ టీ ట్రీ ఆయిల్‌ను ఎప్పుడూ చర్మంపై నేరుగా అప్లై చేయకూడదని.. ఇతర నూనెతో (కొబ్బరి , ఆలివ్, బాదం) కలిపిన తరువాత వాడుకోవచ్చని అంటున్నారు.

Also Read: సైనస్ తో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేసి చూడండి..