Symptoms of Diabetes: మధుమేహ సంకేతాలు కళ్లలో కూడా కనిపిస్తాయని తెలుసా.. ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..

తమకు డయాబెటిస్ ఉందని తెలియని వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. మధుమేహం ఉన్నప్పుడు.. ఒక వ్యక్తికి అనేక విధాలుగా సూచనలు లభిస్తాయి. వాటిలో ఒకటి కళ్ళు కూడా..

Symptoms of Diabetes: మధుమేహ సంకేతాలు కళ్లలో కూడా కనిపిస్తాయని తెలుసా.. ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
Eyes
Follow us

|

Updated on: Feb 22, 2023 | 11:51 AM

నేటి కాలంలో మధుమేహం ఒక సాధారణ వ్యాధిగా మారుతోంది. ఈ బాధితుల సంఖ్య ఎక్కువ మంది మన దేశంలోనే ఉన్నారు. భారతదేశాన్ని డయాబెటిస్ రాజధాని అని కూడా అంటారు. జీవితపు చివరి శ్వాస వరకు రోగిని వెంటాడే వ్యాధి ఇది. అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక వ్యాయామం లేకపోవడం.. జన్యుశాస్త్రం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు మొదలైన అనేక కారణాలు ఈ వ్యాధికి ఉన్నాయి. డయాబెటిక్ రోగి ప్యాంక్రియాస్ చాలా తక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది లేదా అస్సలు ఉత్పత్తి చేయదు. ఇన్సులిన్ అనేది శరీరంలోని కణాలలోకి గ్లూకోజ్‌ని అనుమతించే హార్మోన్. ఈ వ్యాధిలో రోగి తన చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలి.

ప్రపంచంలో తమకు మధుమేహం ఉందని తెలియని వారు చాలా మంది ఉన్నారు. మధుమేహం ఉన్నప్పుడు.. ఒక వ్యక్తి తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం, నిరంతర ఆకలి మొదలైన అనేక విధాలుగా సంకేతాలను పొందుతాడు. అయితే మధుమేహాన్ని కళ్ల ద్వారా కూడా గుర్తిస్తారని తెలుసా..? కళ్లలో కనిపించే అలాంటి కొన్ని సంకేతాల గురించి ఈ రోజు మనం ఇక్కడ తెలుసుకుందాం.. దీని ద్వారా మీకు డయాబెటిస్ ఉందో లేదో తెలుసుకోవచ్చు.

క్యాటరాక్ట్

అకాల క్యాటరాక్ట్ సమస్య మధుమేహానికి సంకేతం. మధుమేహం ఉన్న బాధితుల్లో ఈ సమస్య సమయం కంటే ముందుగానే ప్రారంభమవుతుంది. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే.. ఈ సమస్య చాలా వరకు పెరుగుతుంది.

కళ్లు మసక.. మసక..

మేఘావృతం(కళ్లు మసకగా కనిపించడం) కూడా మధుమేహానికి సంకేతం. మీ కళ్లలో అస్పష్టత కనిపిస్తే.. వెంటనే మధుమేహం కోసం పరీక్ష చేయించుకోండి. శరీరంలోని చక్కెర స్థాయిని నియంత్రించడం ద్వారా బ్లర్రింగ్‌ను నయం చేయవచ్చు. అయితే, కొన్నిసార్లు కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది.

డయాబెటిక్ రెటినోపతి

అనేది మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తి రెటీనాను ప్రభావితం చేసే సమస్య. రెటీనాకు రక్తాన్ని సరఫరా చేసే నరాలు దెబ్బతిన్నప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే.. వ్యక్తి కూడా అంధుడిగా మారవచ్చు.

గ్లకోమా

ఈ సమస్యలో కళ్లలో నుంచి ద్రవం బయటకు రాదు, దీని వల్ల కళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి రక్త కణాలు, నరాలను దెబ్బతీస్తుంది, దీని కారణంగా చూడటంలో సమస్యలు ఉండవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం