Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: నోటి పూత సమస్యతో బాధపడుతున్నారా..? ఈ నేచురల్‌ టిప్స్‌ పాటించండి.. మంచి ఫలితం ఉంటుంది..

Health: కొందరికి నోటి పూత సమస్య సర్వసాధారణంగా వస్తుంటుంది. నోట్లో నాలుకతోపాటు పెదవుల లోపలి భాగంలో పొక్కులు వస్తుంటాయి. దీంతో ఆహార రుచించదు, కొంచెం కారం తగిలినా తట్టుకోలేరు. అయితే...

Health: నోటి పూత సమస్యతో బాధపడుతున్నారా..? ఈ నేచురల్‌ టిప్స్‌ పాటించండి.. మంచి ఫలితం ఉంటుంది..
Health
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 16, 2021 | 2:38 PM

Health: కొందరికి నోటి పూత సమస్య సర్వసాధారణంగా వస్తుంటుంది. నోట్లో నాలుకతోపాటు పెదవుల లోపలి భాగంలో పొక్కులు వస్తుంటాయి. దీంతో ఆహార రుచించదు, కొంచెం కారం తగిలినా తట్టుకోలేరు. అయితే సాధారణంగా ఈ సమస్య వస్తే అయింట్‌మెంట్ రాసుకోవడం లాంటివి చేస్తుంటాం. అయితే కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలతో కూడా ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చనే విషయం మీకు తెలుసా.? నోటి పూత సమస్యను దూరం చేసే ఆ నేచురల్‌ టిప్స్‌పై ఓ లుక్కేయండి..

* నోటి పూత, పొక్కులతో బాధపడేవారి కొంత నెయ్యిని తీసుకొని అవి ఉన్న చోట రాస్తే సమస్య తగ్గుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.

* బియ్యాని కడిగిన తర్వాత నీటి పాడేయకుండా అందులో కొంచెం కలకండ్‌ కలిపి రోజులో చిన్న గ్లాసు తీసుకుంటే నోటి పూత సమస్య తగ్గుతుంది. * పటిక బెల్లం కూడా నోటి పూత సమస్యను తగ్గిస్తుంది. ఇందుకోసం కొంత పటిక బెల్లాన్ని తీసుకొని నీటిలో కలిపి పల్చని ద్రావణంలా తయారు చేసుకోవాలి. అనంతరం దానిని నోట్లో పోసుకొని అలాగే కొద్ది సేపు ఉంచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

* కొత్తిమీరను ముద్దగా నూరి దాన్ని ఒక గ్లాస్‌ నీటిలో కలిపి కషాయంలా తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని నోట్లో పోసుకొని బాగా పుకిలించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. నోటిపూత, కురుపులు తగ్గుతాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

నోటిపూత సమస్యతో బాధపడుతున్న వారు కొంత కాలం పాటు సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. నెయ్యి, ఆకుకూరలు, పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఈ సమయంలో మాంసాహారాన్ని తగ్గిస్తూ.. కారం, పులుపు, ఉప్పులను కొన్ని రోజులు తక్కువగా తినాలి. లేదా పూర్తిగా మానేయాలి. ఆహారం తీసుకున్న తర్వాత కచ్చితంగా నోటిని శుభ్రం చేసుకోవాలి. భోజనం చేసిన తర్వాత తమలపాకులను నేరుగా నమిలి తినాలి. ఇలా చేస్తే నోటిపూత తగ్గుతుంది.

Also Read: Rajendra Prasad: మా మళ్లీ అలా ఉండాలని కోరుకుంటున్న.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజేంద్రప్రసాద్..

Aadhaar Card Safety: కనిపించని నేరస్థులున్నారు జాగ్రత్త.. మీ ఆధార్ కార్డ్ నెంబర్ భద్రతకు 10 చిట్కాలు

Manchu Vishnu: మంచు విష్ణు ప్రమాణ స్వీకారం లైవ్ వీడియో