మీ వెన్నెముక ఐరన్‌ లా దృఢంగా ఉండాలంటే.. పాలతో ఇది కలిపి తినండి.. పుష్కలమైన ప్రొటీన్‌

ఈ రెండు ఆహారాలు కాల్షియం, ప్రోటీన్, పిండి పదార్థాలు, చక్కెర, కొవ్వుకు మంచి మూలం. ఈ రెండింటిని కలపడం ద్వారా, మీరు ఫైబర్, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ బి12, విటమిన్ డి మొదలైన అనేక విటమిన్లను ఈజీగా పొందగలుగుతారు.

మీ వెన్నెముక ఐరన్‌ లా దృఢంగా ఉండాలంటే.. పాలతో ఇది కలిపి తినండి.. పుష్కలమైన ప్రొటీన్‌
Spinal Bone
Follow us
Jyothi Gadda

|

Updated on: May 08, 2023 | 12:31 PM

ఎముకను బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బలహీనత కారణంగా ఎముక నొప్పి సమస్య ఉండవచ్చు. దీనితో పాటు, ఫ్రాక్చర్ ప్రమాదం కూడా పెరుగుతుంది. ఎముక ప్రతిచోటా ముఖ్యమైనదే అయినప్పటికీ, వెన్నెముక ప్రాముఖ్యత ఎక్కువ. ఈ ఎముక శరీరానికి స్థిరత్వం, సమతుల్యతను ఇస్తుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎముకల బలాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీరు కూడా మీ వెన్నెముక, ఇతర ఎముకలను రాయిలా దృఢంగా మార్చుకోవాలనుకుంటే, పాలతో ఇలాంటి ప్రత్యేక రకాల విత్తనాలను కలిపి తినడం ప్రారంభించండి. ఎముకల దృఢత్వానికి అవిసె గింజలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. పాలతో అవిసె గింజలను తీసుకోవం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

అవిసె గింజలను పాలతో కలిపి తింటే ఎముకలకు చాలా మేలు జరుగుతుంది. ఇది ఎముకలకు అవసరమైన బలాన్ని, పోషణను అందిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం, అవిసె గింజలు పిల్లలలో ఎముకల పెరుగుదలకు తోడ్పడతాయి. పెద్దలలో వారి బలాన్ని కాపాడతాయి. మీరు అవిసె గింజల లడ్డూలను కూడా తయారు చేసి తినవచ్చు.

పోషణ విషయానికి వస్తే, పాలు, ఫ్లాక్స్ సీడ్ ప్రధాన పోషకాలు చాలా వరకు పోలి ఉంటాయి. రెండు ఆహారాలు కాల్షియం, ప్రోటీన్, పిండి పదార్థాలు, చక్కెర, కొవ్వుకు మంచి మూలం. ఈ రెండింటిని కలపడం ద్వారా, మీరు ఫైబర్, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ బి12, విటమిన్ డి మొదలైన అనేక విటమిన్లను పొందుతారు.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి , ఎముకల బలం కాల్షియంపై చాలా ఆధారపడి ఉంటుంది. కానీ ఈ ప్రొటీన్ తో పాటు మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ డి, జింక్ మొదలైనవి కూడా అవసరం. పాలు, అవిసె గింజలు కలిసి ఈ అవసరమైన అన్ని పోషకాలను అందిస్తాయి.

పాలు తాగితే ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇది కాల్షియం అద్భుతమైన మూలం. కానీ దాని కాల్షియం మరొక కోణంలో ప్రత్యేకమైనది. ఎందుకంటే, శరీరం దానిని సులభంగా ఉపయోగించుకుంటుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. పాలు, అవిసె గింజల ఇతర ప్రయోజనాలు పరిశీలించినట్టయితే..

* రక్తపోటు నియంత్రణ * మేధాశక్తి * గుండె ఆరోగ్యంగా ఉంటుంది * క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది * శారీరక బలహీనత దూరమవుతుంది

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..