AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Effect: కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. దీని బారిన పడి కోలుకున్న పురుషుల్లో ఆ లోపం పెరుగుతోంది..

కరోనా ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన పరిశోధనల్లో షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తుందని లండన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది.

Corona Effect: కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. దీని బారిన పడి కోలుకున్న పురుషుల్లో ఆ లోపం పెరుగుతోంది..
Corona Effect On Sperm
KVD Varma
|

Updated on: Dec 23, 2021 | 9:43 AM

Share

Corona Effect: కరోనా ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన పరిశోధనల్లో షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తుందని లండన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. కరోనా సోకిన వ్యక్తి నయమైన తర్వాత కూడా, దాని ప్రభావం అతని స్పెర్మ్‌పై నెలల తరబడి ఉంటుంది. బెల్జియంలో కరోనా సోకిన 120 కరోనాపై పరిశోధన తర్వాత ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ ఈ సమాచారాన్ని ఇచ్చింది. సోకిన వారందరి వయస్సు దాదాపు 35 సంవత్సరాలు. అందరూ కోలుకోవడానికి 1 నుండి 2 నెలలు మాత్రమే పట్టింది. పరిశోధన ప్రకారం, కరోనా వైరస్ పురుషుల స్పెర్మ్ మొటిలిటీ, స్పెర్మ్ కౌంట్‌పై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

ఒక నెలలోపు నయమైన రోగుల స్పెర్మ్‌ను వేర్వేరు సమయాల్లో మూడుసార్లు పరీక్షించినప్పుడు , 60% మంది రోగుల స్పెర్మ్ చలనశీలత,37% స్పెర్మ్ కౌంట్ ప్రభావితమైనట్లు కనుగోన్నారు. 1 నుండి 2 నెలలలోపు తిరిగి పరీక్షించినప్పుడు, స్పెర్మ్ చలనశీలత 37%, స్పెర్మ్ కౌంట్ 29% ప్రభావితమైనట్లు తేలింది. అదే సమయంలో, 2 నెలల తర్వాత, స్పెర్మ్ చలనశీలత 28%, స్పెర్మ్ కౌంట్ 6% తక్కువగా ఉన్నట్లు బయటపడింది.

డెల్టా ఎంత ప్రమాదకరమో..

డెల్టా ఎంత ప్రమాదకర వేరియంటో అంత ప్రమాదకరమైనది ఒమిక్రాన్ వేరియంట్ అని కూడా ఆ పరిశోధన వెల్లడించింది. 2 లక్షల మంది కరోనా సోకిన వారిపై ఈ పరిశోధన జరిగింది. ఇందులో దాదాపు 11,329 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. పరిశోధన ప్రకారం, మరొక కరోనా వేరియంట్ సోకిన రోగికి 6 నెలల పాటు మళ్లీ ఇన్ఫెక్షన్ రాకుండా 85% రక్షణ ఉంటుంది. అయితే ఓమిక్రాన్ సోకిన రోగికి 19% వరకు రక్షణ ఉంటుంది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌తో మళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం 5.4% ఎక్కువ.

స్పెర్మ్ మొటిలిటీ,స్పెర్మ్ కౌంట్ అంటే ఏమిటి?

స్పెర్మ్ చలనశీలత దాని వేగానికి సంబంధించినది. ఒక ఆరోగ్యవంతమైన పురుషుడు గంటకు 120 నుంచి 350 చొప్పున స్పెర్మ్ లేదా స్పెర్మాటోజోను కలిగి ఉంటాడు. అయితే, స్పెర్మ్ కౌంట్ అనేది పురుషుల వీర్యంలోని స్పెర్మాటోజోవా సంఖ్యను సూచిస్తుంది. ఒక సాధారణ వ్యక్తిలో ఒక మిల్లీలీటర్ వీర్యంలో 15 మిలియన్ల నుంచి 200 మిలియన్ల స్పెర్మ్‌లు కనిపిస్తాయి. రెండూ ఒక వ్యక్తి లైంగిక జీవితంపై ప్రభావం చూపుతాయి.

ఇవి కూడా చదవండి: Pushpa: The Rise: హిందీలోనూ తగ్గేదే లే అంటున్న ‘పుష్ప’రాజ్.. భారీ వసూళ్లు దిశగా..

Viral Video: చలికాలం అవస్థలు.. కింద మంట పైన స్నానం.. వీడియో చూస్తే షాక్‌..

Viral Video: ఈ భారతీయుడి డ్యాన్స్‌ చూస్తే ప్రభుదేవా కూడా ఫిదా అవుతాడు..!