SmartWatch: లక్షణాలు లేకపోయినా కరోనాను గుర్తించే స్మార్ట్ వాచ్.. పరిశోధనలో సంచలన విషయాలు..

గత రెండేళ్లుగా యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా.. ప్రాణ నష్టం ఎక్కువగానే

SmartWatch: లక్షణాలు లేకపోయినా కరోనాను గుర్తించే స్మార్ట్ వాచ్.. పరిశోధనలో సంచలన విషయాలు..
Smart Watch
Follow us

|

Updated on: Dec 04, 2021 | 4:41 PM

గత రెండేళ్లుగా యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా.. ప్రాణ నష్టం ఎక్కువగానే జరిగింది. ఇక ఈ మహమ్మారి ప్రభావంతో ఇప్పుడు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఫిట్ నెస్ పై.. ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తున్నారు. అయితే ఇటీవల స్మార్ట్ వాచ్, ఫిట్ నెస్ ట్రాకర్ ఉపయోగించేవారి సంఖ్య పెరిగిపోయింది. నిద్రపోయే సమయం నుంచి ఉదయన్నే వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె వేగాన్ని తెలుసుకునేందుకు స్మార్ట్ వాచ్, ఫిట్ నెస్ ట్రాకర్ ఉపయోగిస్తున్నారు. తాజాగా కరోనా లక్షణాలు లేకుండానే కోవిడ్ ఉందా ? లేదా అనేది తెలుసుకునే స్మార్ట్ వాచ్ కనిపెట్టారు.

అమెరికా స్టాన్ ఫోర్ట్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కరోనా గురించి ముందుగానే తెలుసుకోవడానికి మొబైల్‏ని ఉపయోగించేలా MyPhD యాప్ సిద్ధం చేశారు. ఇది స్మార్ట్ వాచ్ లేదా ఫిట్ నెస్ ట్రాకర్ డేటా నుంచి కరోనాను గుర్తించవచ్చు. ఈ యాప్ తో పరీక్షకు ముందే 80 శాతం మంది వినియోగదారులలో కరోనా ఇన్ఫెక్షన్ ను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అధ్యయనం ఫలితాలను మెడికల్ జర్నల్ నేచర్ మెడిసిన్ లో ప్రచురించబడ్డాయి.

ఈ అధ్యయనం కోసం 18 నుంచి 80 సంవత్సరాల వయసు గల 3300 మంది ఆండ్రాయిడ్.. ఆపిల్ పరికరాలలో ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేశారు. ఇది ధరించిన కొందరి మణికట్టు నుంచి వారి ఆరోగ్య డేటాను పరిశీలించి… దానిని సురక్షిత క్లౌడ్ సర్వర్ కు పంపింది. ఇప్పుడు పరిశోధకులు ఈ క్లౌడ సర్వర్ లోని డేటాను విశ్లేషించగలరు. ఈ యాప్ Fitbit, Apple Watch, Garmin పరికరాలు .. ఇతర గాడ్జెట్‏లలో ఉపయోగిస్తున్నారు. ఈ గాడ్జెట్స్ ధరించేవారిలో గుండె వేగం.. నిద్ర సమయం మార్పులను చూడటానికి శాస్త్రవేత్తలు అల్గారిథమ్ ను ఉపయోగించారు. ఈ గాడ్జెట్స్ ధరించిన వారిలో గుండె వేగం.. రోగ నిరోధకశక్తి ఒకదానికొకటి సంబంధం గురించి వివరించింది. కరోనా సోకిన వారిలో గుండె వేగం తక్కువగా ఉంటుందని.. సాధారణ వ్యక్తిలో గుండె కొట్టుకోవడంలో ఎలాంటి మార్పు లేదని తేలింది.

ఈ అధ్యయనంలో నవంబర్ 2020 నుంచి జూలై 2021 వరకు 2155 కంటే ఎక్కువ మంది వినియోగదారులు తమ రోజూవారీ ఆరోగ్యడేటాను అందుకున్నారు. అలాగే 2117 మందితో సర్వే పూర్తిచేయగా.. అందులో 278 మంది కరోనా సోకినట్లు రిజల్ట్ వచ్చింది. వీరిలో 84 మంది ఫిట్‌బిట్ లేదా యాపిల్ వాచ్ ధరించి ఉన్నారు. వీరిలో 60 మందికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని హెచ్చరికలు వచ్చాయి. ఈ స్మార్ట్‌వాచ్‌ల ద్వారా, ఈ వ్యక్తులు లక్షణాలను అభివృద్ధి చేయడానికి 3 రోజుల ముందు అసాధారణ రీడింగ్ కనుగొన్నారు.

Also Read:Katrina Kaif: కత్రినా పెళ్లికి ఎంతమంది వీఐపీలు వస్తున్నారంటే!.. వివరాలు వెల్లడించిన రాజస్థాన్‌ అధికారులు..

Mahesh Babu MEK: మహేష్‌, ఎన్టీఆర్‌ల సందడికి సమయం ఆసన్నమైంది.. ఎవరు మీలో కోటీశ్వరులు టెలికాస్ట్‌ అయ్యేది..