AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Care: చలికాలంలో పొడిబారిపోతున్న చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి..మీ ముఖం మెరిసిపోతుంది!

చలికాలంలో పొడిబారిన సమస్య సర్వసాధారణం. అదే సమయంలో కాలుష్య ప్రభావం వల్ల చర్మం పొడిబారడమే కాకుండా చర్మం డల్ గా అనిపించడం మొదలవుతుంది.

Winter Care: చలికాలంలో పొడిబారిపోతున్న చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి..మీ ముఖం మెరిసిపోతుంది!
Winter Skin Care
KVD Varma
|

Updated on: Dec 04, 2021 | 5:49 PM

Share

Winter Care: చలికాలంలో పొడిబారిన సమస్య సర్వసాధారణం. అదే సమయంలో కాలుష్య ప్రభావం వల్ల చర్మం పొడిబారడమే కాకుండా చర్మం డల్ గా అనిపించడం మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో, ముఖ అందం మొత్తం పాడైపోతుంది. చూడటానికి ముఖం వాడిపోయినట్లు కనిపిస్తుంది. ఈ ఇబ్బందిని ఎదుర్కోవడానికి మార్కెట్‌లో చాలా రకాల క్రీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటి వలన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి వాటిలో ఉండే కెమికల్స్ వాళ్ళ ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అందుకే చర్మం పొడిబారడాన్ని నివారించే కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. ఇవి చర్మం పొడిబారడాన్ని క్షణాల్లో తొలగిస్తాయి. ఇవి మీ చర్మాన్ని లోపలి నుండి మాయిశ్చరైజ్ చేసి మెరిసేలా చేసే నేచురల్ రెమెడీస్.

పచ్చి పాలు

పచ్చి పాలు చర్మానికి ఒక వరం. ఇది మీ చర్మాన్ని పోషించడానికి పని చేసే అన్ని పోషకాలను కలిగి ఉంటుంది. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్, వివిధ విటమిన్లు, ప్రొటీన్లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి హైడ్రేట్‌గా ఉంచుతాయి. పచ్చి పాలు మీ చర్మంలోని మురికిని తొలగిస్తాయి. గొప్ప టోనర్‌గా పనిచేస్తాయి. దీన్ని చర్మంపై అప్లై చేసి కాసేపు అలాగే ఉంచి, ఆ తర్వాత నీటితో ముఖం కడుక్కోవాలి.

దోసకాయ

దోసకాయను సలాడ్‌గా తింటే మీ ముఖం మెరిసిపోతుంది. ఇది ముఖానికి తాజాదనాన్ని తెస్తుంది. మురికిని తొలగిస్తుంది. దోసకాయ రసాన్ని పెరుగులో కలిపి రాసుకుంటే చర్మం మెరిసిపోయి లోపల తేమ అందుతుంది.

ఆలివ్ నూనె

ఆలివ్ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా చేస్తుంది. ముఖానికి సహజమైన మెరుపును తెస్తుంది. అకాల వృద్ధాప్యాన్ని అనుమతించదు. ఆలివ్ ఆయిల్ సహాయంతో, మీరు మీ మేకప్‌ను కూడా సులభంగా తీయవచ్చు.

తేనె

తేనె మీ చర్మంలోని తేమను మూసివేస్తుంది. ఇది ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను తొలగించడానికి కూడా పనిచేస్తుంది. రోజూ అర టీస్పూన్ తేనెను కొద్దిగా నీటిలో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖానికి తేమ అందుతుంది. పొడిబారడం ఆగిపోతుంది. ముఖం బాగా పొడిగా ఉంటే తేనె మిశ్రమంలో పాలు మిక్స్ చేసి రాసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..

Cryptocurrency: భారీ క్రిప్టోకరెన్సీ చోరీ.. సైబర్ దాడితో హ్యాకర్లు చేసిన పని.. ఎన్ని క్రిప్టో టోకెన్‌లను దొంగిలించారంటే..

Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం