Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping Problems: వయసు పెరిగిన వారిలో సరైన నిద్రలేకపోవడం కారణం ఇదేనట!

ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. సరైన నిద్రలేనివారికి అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. వయసు పెరిగిన కొద్ది కొందరికి నిద్ర కూడా తక్కువగా ఉంటుంది. ఈ నిద్రలేమి తనం..

Sleeping Problems: వయసు పెరిగిన వారిలో సరైన నిద్రలేకపోవడం కారణం ఇదేనట!
Sleeping
Follow us
Subhash Goud

|

Updated on: Nov 02, 2022 | 8:00 AM

ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. సరైన నిద్రలేనివారికి అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. వయసు పెరిగిన కొద్ది కొందరికి నిద్ర కూడా తక్కువగా ఉంటుంది. ఈ నిద్రలేమి తనం వృద్ధుల్లో ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న వయస్సులో వృద్ధులకు ఇలా ఎందుకు జరుగుతుంది. ఇటీవల దీనిపై అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. అధ్యయనంలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి, ఒక వ్యక్తి నిద్ర-మేల్కొనే స్థితిని నియంత్రించే మెదడులోని భాగం వయస్సుతో ఎలా బలహీనపడుతుందో గుర్తించారు. వృద్ధులలో నిద్రలేమి సమస్యను అధిగమించేందుకు మందులు ఇస్తారు. వయస్సుతో ఈ మందుల ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది. అయితే న్యూరాన్ల ద్వారా విడుదలయ్యే మెదడులోని కొన్ని భాగాలలో ప్రత్యేక రసాయనాలు హైపోక్రెటిన్లు కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఈ రసాయనం తగ్గిపోయి నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు ఎక్కువవుతాయి.

వృద్ధాప్యంలో నిద్రలేమి సమస్య:

వృద్ధాప్యంలో నిద్ర లేమి సమస్యను గుర్తించడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ఇందుకోసం ఎలుకల రెండు బృందాలను చేశారు. మొదటి సమూహంలో 3 నుండి 5 నెలల వయస్సు, రెండవ సమూహం 18 నుండి 22 నెలల వయస్సు గల ఎలుకలు ఉన్నాయి. మెదడులోని న్యూరాన్లు కాంతిని ఉపయోగించి ప్రేరేపించారు. దీని తర్వాత ఇమేజింగ్ టెక్నిక్‌లతో మెదడును పరిశీలించారు. విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్న ఎలుకల కంటే పెద్ద ఎలుకలు 38 శాతం ఎక్కువ హైపోక్రెటిన్‌లను కోల్పోయాయని నివేదిక వెల్లడించింది.

నిద్రలేమి సమస్యను అధిగమించేందుకు..

పరిశోధన ఫలితాల సహాయంతో నిద్రలేమి సమస్యను అధిగమించేందుకు మెరుగైన ఔషధాలను సిద్ధం చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వయస్సుతో ఔషధాల తగ్గుదల ప్రభావాన్ని నియంత్రించవచ్చు. వృద్ధులలో నిద్రలేమి సమస్యను ఎలా అధిగమించాలి అనే విషయాలను కొనుగోన్నారు శాస్త్రవేత్తలు. పరిశోధకుడు లూయిస్ డి లెసియా మాట్లాడుతూ.. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు సరైన నిద్ర రాదని చెప్పారు. మనిషి నిద్ర కూడా అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం, డిప్రెషన్ వంటి వ్యాధులకు దారితీస్తుందని గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..