Skin Care Tips: ఈ చెడు అలవాట్లు మీ చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.. అవేంటంటే..
Skin Care Tips: ఎలాంటి ఆరోగ్య సమస్య ఎదురైనా.. ముందుగా చర్మంపై ప్రభావం చూపుతుంది. శరీరంలో చర్మం చాలా సున్నితమైనది. అందుకే చర్మంపై నిరంతరం ఏదో ఒక సమస్య వస్తుంది. దద్దుర్లు, ర్యాషెస్, మొటిమలు,
Skin Care Tips: ఎలాంటి ఆరోగ్య సమస్య ఎదురైనా.. ముందుగా చర్మంపై ప్రభావం చూపుతుంది. శరీరంలో చర్మం చాలా సున్నితమైనది. అందుకే చర్మంపై నిరంతరం ఏదో ఒక సమస్య వస్తుంది. దద్దుర్లు, ర్యాషెస్, మొటిమలు, మచ్చలు, కురుపులు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మెడిసిన్స్, ఖరీదైన కాస్మోటిక్స్ వాడుతుంటాం. అయితే, ఇవి తాత్కాలిక ప్రభావాన్ని మాత్రమే చూపుతాయి. వీటిని వాడినంత వరకే ప్రభావం ఉంటుంది. ఆ తరువాత పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. అయితే, శాశ్వతంగా మెరిసే, శుభ్రమైన చర్మం కావాలంటే.. మీ జీవన శైలిని మార్చుకోవడం తప్ప మరో మార్గం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని చెడు అలవాట్లు చర్మ సమస్యలకు కారణం అవుతాయని చెబుతున్నారు. మరి ఆ చెడు అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నీరు తక్కువగా తాగటం.. నీరు మన శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి చర్మానికి తేమను అందిస్తుంది. నీరు ఎక్కువగా తాగే వారి చర్మం సహజంగా మెరుస్తుంది. అందుకే రోజులో శరీరానికి సరిపడినన్ని నీళ్లు తాగడం తప్పనిసరి.
జంక్ ఫుడ్స్.. మసాలా, అధిక నూనెతో చేసిన ఆహారాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా. మీ చర్మ సౌందర్యాన్ని కూడా దెబ్బ తీస్తాయి. అలాగే కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చర్మం డల్‌గా మారుతుంది. ఈ అలవాట్లను వదిలి సలాడ్, పచ్చి కూరగాయలు, పండ్లు, కొబ్బరి నీళ్లు, పెరుగు, మజ్జిగ, జ్యూ్స్, గ్రీన్ టీ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి.
సరైన నిద్ర లేకపోవడం.. రాత్రి ఆలస్యంగా పడుకున్నా, తగినంత నిద్ర లేకపోయినా.. దాని ప్రభావం చర్మంపై ఉంటుంది. చర్మం వాడిపోయినట్లు కనిపిస్తుంది. అందుకని, కనీసం 8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి.
చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.. ఎక్కడికైనా బయటకు వెళితే కాలుష్యం, దుమ్ము తదితర దూళి కణాలు చర్మంపై పడుతాయి. అంతే కాకుండా మితిమీరిన మేకప్ వల్ల చర్మం సహజమైన మెరుపును కూడా కోల్పోతుంది. బయటి నుంచి వచ్చిన తర్వాత చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. లేదంటే.. మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలన్నీ రావడం మొదలవుతాయి. దీన్ని నివారించడానికి, క్రమం తప్పకుండా ఇంటికి వచ్చిన తర్వాత క్లెన్సర్ సహాయంతో చర్మాన్ని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆ తర్వాత చర్మాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి.
Also read:
Puzzle Picture: ‘దమ్ముంటే నన్ను కనిపెట్టండి’.. డాగ్ విసిరిన సవాల్.. ఆన్సర్ చెప్పే సత్తా మీలో ఉందా?