Dry Cough-Ayurvedic Tips: పొడి దగ్గు ఇబ్బంది పెడుతుందా.. ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గలేదా.. ఈ వంటింటి చిట్కాలు మీకోసమే

Dry Cough-Ayurvedic Tips వేసవి నుంచి వర్షాకాలంలో అడుగు పెడితే.. సర్వసాధారణంగా ఎక్కువ మంది సీజనల్ వ్యాధుల బారినపడతారు. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరాలు చుట్టుముడతాయి. అయితే ఇప్పుడు ఓ వైపు కరోనా..

Dry Cough-Ayurvedic Tips: పొడి దగ్గు ఇబ్బంది పెడుతుందా.. ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గలేదా.. ఈ వంటింటి చిట్కాలు మీకోసమే
Dry Cough
Follow us

|

Updated on: Sep 20, 2021 | 2:17 PM

Dry Cough-Ayurvedic Tips వేసవి నుంచి వర్షాకాలంలో అడుగు పెడితే.. సర్వసాధారణంగా ఎక్కువ మంది సీజనల్ వ్యాధుల బారినపడతారు. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరాలు చుట్టుముడతాయి. అయితే ఇప్పుడు ఓ వైపు కరోనా మరోవైపు సీజనల్ వ్యాధులు ..  దీంతో చిన్న పాటి దగ్గు వచ్చినా భయపడే పరిస్థితులు ఉన్నాయి. చల్లటి వాతావరణం కొంతమందికి ఆరోగ్య సమస్యలు తీసుకొస్తుంది. ముఖ్యంగా దగ్గు మరీ ఇబ్బంది పెడుతుంది. అయితే ఇలా దగ్గురావడానికి ఒక్క వాతావరణం మాత్రమే కారణం కాదు.. గొంతు వెనకాల మ్యూకస్, ఏవో తెలియని చికాకు పెట్టే జీవులు జారుకున్నప్పుడు దగ్గు అసంకల్ప ప్రతీకార చర్యగా వస్తుంది. కొంతమంచి పొడి దగ్గుతో తీవ్రంగా ఇబ్బంది పడతారు. కొన్ని సార్లు ఎన్ని మందులు ఉపయోగించినా దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే అలాంటి సమయంలో వంటింటి చిట్కాలు మంచి ఔషధంగా పని చేస్తాయి. సింపుల్ గా దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది. ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం..

*పసుపు పాలు గోరు వెచ్చగా రోజు రెండు సార్లు తాగితే దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది. *దగ్గు తీవ్రంగా ఉంటే తిప్ప తీగ మంచి ఔషధం. 2 చెంచాల తిప్పతీగ రసాన్ని నీటిలో కలిపి దగ్గు తగ్గేవరకూ ప్రతిరోజూ ఉదయాన్నే తాగితే ఎంత తీవ్రమైన దగ్గు అయినా తగ్గుతుంది. * దగ్గు కోసం మరొక ఎఫెక్టివ్ ఆయుర్వేద చిట్కా తేనె , యష్టిమధురం ,దాల్చినచెక్క.. వీటి పొడిని సమపాళ్లలో తీసుని నీటిలో కలుపుకుని రోజుకి రెండు సార్లు పొద్దున, సాయంత్రం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. *ఆగకుండా దగ్గు వేధిస్తుంటే.. మిరియాల కషాయం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అర స్పూన్ నల్ల మిరియాల పొడిలో దేశీయ ఆవు నెయ్యితో కలుపుని ఈ మిశ్రమాన్ని ఏదైనా తిన్న తర్వాత తీసుకోవాలి. *పిల్లలు దగ్గుతో ఇబ్బంది పడుతుంటే దానిమ్మ రసంలో చిటికెడు అల్లం పొడిని కలిపి ఇస్తే మంచి ఫలితం ఉపశమనం ఇస్తుంది. * వేడి వేడి మసాలా టీ, దగ్గుని సహజంగా తగ్గిస్తుంది. అర చెంచా అల్లం పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, కొన్ని లవంగాలు టీకి జత చేసి వేడిగా టీ తాగితే దగ్గు తగ్గుతుంది.

సర్వసాధారణంగా దగ్గు రాత్రి సమయంలో అధికంగా వస్తుంది. కనుక దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే తలని కొంచెం ఎత్తులో ఉండేలా చూసుకుని నిద్రపోతే దగ్గు తగ్గి.. హాయిగా నిద్రపడుతుంది.

Also Read: Milk Adulteration Test: మీరు వాడే పాలు స్వచ్ఛమైనవా.. లేదా కల్తీవా ఈ సింపుల్ చిట్కాలతో చెక్ చేసుకోండి..

Garden On Car Roofs: కరోనా ఎఫెక్ట్..వాడకపోవడంతో పాడైన టాక్సీలు.. ఆదాయం కోసం రూఫ్ టాప్‌లపై కూరగాయల పెంపకం..