Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: రోజూ 5 రకాల పండ్లు.. కూరగాయలు తింటే ఎక్కువ రోజులు బతుకుతారట… నిపుణులు ఏం అంటున్నారంటే..

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో హెల్తీ ఫుడ్ తీసుకోవాలని సూచిస్తుంటారు డాక్టర్స్. ముఖ్యంగా రోజూ పండ్లు తినాలని.. అలాగే తాజా కూరగాయలను తినాలని చెబుతుంటారు. పండ్లు..

Health Tips: రోజూ 5 రకాల పండ్లు.. కూరగాయలు తింటే ఎక్కువ రోజులు బతుకుతారట... నిపుణులు ఏం అంటున్నారంటే..
Health Tips
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 20, 2021 | 9:41 PM

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో హెల్తీ ఫుడ్ తీసుకోవాలని సూచిస్తుంటారు డాక్టర్స్. ముఖ్యంగా రోజూ పండ్లు తినాలని.. అలాగే తాజా కూరగాయలను తినాలని చెబుతుంటారు. పండ్లు.. కూరగాయలు తినడం వలన ఎంత పెద్ద వ్యాధులైన సులభంగా తగ్గిపోతాయని.. డాక్టర్ అవసరం కూడా ఉండదంటారు. తాజాగా హార్వర్ట్ యూనివర్సిటీ జరిపిన పరీక్షలలోనూ ఐదు రకాల పండ్లు.. కూరగాయాలు తినడం వలన వ్యాధుకు చెక్ పెట్టెయ్యొచ్చని తెలీంది. అంతేకాదు.. ఆకాస్మాత్తుగా మరణించే ప్రమాదం తగ్గుతుందట. ఈ అధ్యయనం సర్క్యులేషన్ జర్నల్‌లో ప్రచురించబడింది. ఈ అధ్యయనం గత 30 సంవత్సరాలలో రెండు మిలియన్ల మంది ఆహారం..ఆరోగ్య డేటాను విశ్లేషించింది. ఈ అధ్యయనం కోసం డేటా ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాల నుండి తీసుకున్నారు.

తాజా అధ్యాయనం ప్రకారం ప్రతి రోజూ కూరగాయలు.. ఐదు రకాల పండులు తినేవారికి ఆరోగ్యం బాగుంటుందని.. అనారోగ్య సమస్యలు ఉండవని.. ముఖ్యంగా అకాల మరణించే ప్రమదాన్ని 13 శాతం తగ్గుతుందని తెలీంది. అలాగే గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు 12 శాతం తగ్గాయట. అంతేకాదు.. క్యాన్సర్ కారణంగా మరణించే వారి సంఖ్య 10 శాతం తగ్గిందని.. శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం కూడా 35 శాతం తగ్గిందని వెల్లడైంది.

రోజుకు 5 పండ్లు.. కూరగాయలు తీసుకోవడం వలన అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. ఈ అధ్యాయనం జరిపిన ప్రధాన రచయిత డాక్టర్ డేనయిల్ వాంగ్ మాట్లాడుతూ.. పండ్లు..కూరగాయలలో అనేక పోషకాలున్నాయని.. ఇవి మనకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుతాయని అన్నారు. పొటాషియం.. మెగ్నీషియం.. ఫైబర్, పాలీఫోనాల్స్ ఉన్నందున వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఉన్నాయని.. ఇవి గుండె.. రక్తనాళాలను మెరుగుపరుస్తాయని తెలిపారు. తాజా అధ్యాయనం ప్రకారం.. రోజూ పండ్లు, ఆకు కూరలు.. కూరగాయలు తీసుకోడవం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు. వీటిలో విటమిన్ సీ, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటాయి. పాలకూర, క్యాబేజీ, నారింజ, బెర్రీలు, క్యారెట్స్ తీసుకోవడం మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్.. క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి.

రోజూలో పండ్లు… కూరగాయలు ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలుసుకుందామా..

ఆపిల్ ఒకటి. నేరేడు పండు.. ఒకటి లేదా అరకప్పు. అవకాడో.. సగం లేదా అర కప్పు అరటి పండు.. ఒకటి. బ్లూబెర్రీ.. అర కప్పు ద్రాక్షలు.. ఒకటి లేదా రెండు కప్పులు. నారింజ.. ఒకటి స్ట్రాబెర్రీ.. అరకప్పు.. కాలీఫ్లవర్.. అరకప్పు మొలకలు.. అరకప్పు క్యాబేజీ.. అరకప్పు.. క్యారెట్.. 80 నుంచి 85 గ్రాములు వంకాయ.. వంద గ్రాములు.. ఆవాలు ఆకుకూరలు.. అరకప్పు పాలకూర.. కప్పు మిశ్రమ కూరగయాలు.. అరకప్పు ఉల్లిపాయ.. ఒకటి బీన్స్.. అరకప్పు.. టమోటా.. రెండు కూరగాయల సూప్.. ఒక కప్పు.. తియ్యటి బంగాళ దుంపలు.. 100 గ్రాములు.

ట్వీట్..

Also Read: Bigg Boss 5 Telugu: అబ్బాయిలతోనే బిజీగా ఉంటున్నావ్.. హీట్ పెంచిన ప్రియా కామెంట్స్.. రెచ్చిపోయిన ఆ ఇద్దరు..

వీకెండ్ పార్టీలో స్టార్ హీరోయిన్స్ రచ్చ.. ఒకే ఫ్రేమ్‏లో సమంత.. కీర్తి.. త్రిష.. గులాబీలతో ఫోజులు..