Yoga Precautions: యోగా చేసే సమయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? చాలా డేంజర్‌.. అవేంటంటే..

Yoga Precautions: ప్రస్తుత రోజుల్లో మారుతోన్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అందరూ తరచుగా జబ్బుల బారిన పడుతున్నారు. దీంతో అందరికీ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. మరీ ముఖ్యంగా...

Yoga Precautions: యోగా చేసే సమయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? చాలా డేంజర్‌.. అవేంటంటే..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 21, 2021 | 6:59 AM

Yoga Precautions: ప్రస్తుత రోజుల్లో మారుతోన్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అందరూ తరచుగా జబ్బుల బారిన పడుతున్నారు. దీంతో అందరికీ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత అందరూ ఆరోగ్యంపై దృష్టి సారించారు. దీసుకునే ఆహారం నుంచి వర్కవుట్ల వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది యోగాను తమ జీవితంలో ఓ భాగం చేసుకున్నారు. జిమ్‌లకు వెళ్లాల్సిన అవసర లేదు, కాస్త సమయం దొరికినా సింపుల్‌ చేసుకోవచ్చు కాబట్టి యోగాకు ఆదరణ బాగా పెరిగింది. అయితే యోగా చేసే సమయంలో చేయకూడని కొన్ని తప్పులు ఉన్నాయని మీకు తెలుసా.? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వాతారణం ఎక్కువగా వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా యోగ చేయకూడదు. ఎందుకంటే బయటి వాతావరణం శరీరంపై ప్రభావం చూపుతుంది. యోగా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి వాతావరణ పరిస్థితులు సమంగా ఉన్న సమయంలోనే యోగా చేయాలి.

* ఇక యోగాసనాలు చేస్తున్న సమయంలో ఒకేసారి ఎక్కువగా కష్టపడకూడదు. నెమ్మదినెమ్మదిగా యోగాసనాలలో కష్టమైన ఆసనాలను ప్రయత్నించాలి. ఒకేరోజు అన్ని రకాల ఆసనాలను వేయాలనుకోకూడదు. రోజురోజుకూ కఠినమైన ఆసనాలను ప్రయత్నిస్తూ పోవాలి.

* భోజనం చేసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో యోగా చేయకూడదు. దీనివల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారం తీసుకున్న తర్వాత కనీసం 2 నుంచి 3 గంటల తర్వాతే యోగా చేయాలి.

* ఆరోగ్యం సహకరించని సందర్భాల్లో, తీవ్ర అలసటగా ఉన్న సమయంలో యోగా చేయకపోవడమే మంచిది. యోగాలో ఏముందు కూర్చుని చేసేదాగా.? పెద్దగా శరీరంపై ఒత్తిడి పడదు కదా.. అని అనుకోకూడదు. ఎందుకంటే యోగా చేసే సమయంలో శరీరంలోని అన్ని అవయవాలు కదులుతున్నాయి. కాబట్టి శక్తి వినియోగం పెరగుతుంది. దీనికి తగ్గట్లు శరీరం రడీగా లేకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది.

* ఇక యూట్యూబ్‌ వీడియోల్లో చూసి ఇష్టం వచ్చిన ఆసనాలను ప్రయత్నించకూడదు. కచ్చితంగా ఏదైనా కొత్త ఆసనం ప్రయత్నించే సమయంలో నిపుణుల సలహా తీసుకోవాలి.

* యోగ చేసే సమయంలో వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. ఎందుకంటే యోగా ఎక్కువగా శ్వాసకు సంబంధించిన వ్యాయామం.. టైట్‌ డ్రస్‌లను ధరించడం వల్ల పక్కటెముకలు, ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. కాబట్టి శ్వాస సరిగ్గా అందకపోయే అవకాశం ఉంటుంది.

* యోగా చేసిన వెంటనే స్నానం చేయకూడదు. ఎందుకంటే ఏదైనా వ్యాయామం చేయగానే శరీరం వేడెక్కుతుంది. అలాంటి సందర్భంలో శరీరాన్ని మళ్లీ ఒకేసారి చల్లగా మార్చకూడదు. కాబట్టి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాతే స్నానానికి వెళ్లాలి.

Also Read: Health Tips: రోజూ 5 రకాల పండ్లు.. కూరగాయలు తింటే ఎక్కువ రోజులు బతుకుతారట… నిపుణులు ఏం అంటున్నారంటే..

Beer Bottles: కంపెనీ ఏదైనా రంగులు మాత్రం అవే.. బీర్ సీసా కలర్ ఎందుకు ఆ రెండు రంగుల్లోనే ఉంటుందో తెలుసా..

Dry Cough-Ayurvedic Tips: పొడి దగ్గు ఇబ్బంది పెడుతుందా.. ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గలేదా.. ఈ వంటింటి చిట్కాలు మీకోసమే