Palleru Benefits: మగవారిలో లైంగిక సామర్ధ్యాన్ని పెంచే ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం ‘పల్లేరు’.. ఎలా ఉపయోగించాలంటే

Palleru Health Benefits: మనం రోజూ అనేక మొక్కలు చూస్తుంటాం.. కొన్నింటిని పిచ్చి మొక్కలంటూ, ముళ్ల మొక్కలంటూ వాటిని పట్టించుకోము.. కానీ కొన్ని మొక్కల్లో అద్భుతమైన ఔషధగుణాలు దాగున్నాయి.  అటువంటి..

Palleru Benefits: మగవారిలో లైంగిక సామర్ధ్యాన్ని పెంచే ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం 'పల్లేరు'.. ఎలా ఉపయోగించాలంటే
Palleru
Follow us

|

Updated on: Sep 21, 2021 | 8:14 AM

Palleru Health Benefits: మనం రోజూ అనేక మొక్కలు చూస్తుంటాం.. కొన్నింటిని పిచ్చి మొక్కలంటూ, ముళ్ల మొక్కలంటూ వాటిని పట్టించుకోము.. కానీ కొన్ని మొక్కల్లో అద్భుతమైన ఔషధగుణాలు దాగున్నాయి.  అటువంటి వాటిల్లో ఒకటి పల్లేరు మొక్క. ఇది అందరికీ తెలిసిన మొక్క.. ఇదొక ముళ్ళ మొక్క. దీనిని ఆయుర్వేదంలో గోక్షుర అంటారు. అయితే ఈ పల్లేరు మొక్కలో అనేక శారీరక రుగ్మతలను తగ్గించే గుణం ఉంది. ముఖ్యంగా ఆయుర్వేద గుణకర్మలు మూత్రవిరేచన, మూత్రంలో నొప్పిని తగ్గిస్తుంది, మూత్ర వ్యవస్థలో రాళ్లను కరిగిస్తుంది,   శరీరంలో సంచితరమైన దోషాలను తొలగిస్తుంది. అంతేకాదు వివిధరకాలుగా నొప్పిని తగ్గిస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుం, శుక్రకణాల దోషాలను తొలగిస్తుంది. ముఖ్యంగా శరీరంలోని మూడు దోషాలను తగ్గిస్తుంది. ఈరోజు పల్లేరు మొక్క ప్రయోగాలను గురించి తెలుసుకుందాం.

*పల్లేరు మొక్క యొక్క ప్రధమ లక్షణం చలవ చేయటం.. పల్లేరు మొక్కను సమూలంగా దంచి నీటిలో ఉడికించి ఆ నీటిని త్రాగడం వల్ల మూత్ర సమస్యలు నివారించబడతాయి. *మూత్రం లో మంట ,రాళ్ళు వంటి సమస్యలు పోతాయి. అంతేకాక ఈ నీటిని త్రాగడం వల్ల మన తలలో ఉండే చెడు నీరు జలుబు పోతాయి *పల్లె మొక్క కషాయంలో కంద చెక్కెర లేదా తేనె కలుపుకొని త్రాగడం వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా గుండె దడ , ఆయాసం, నీరసం తగ్గుతాయి *పల్లేరు కషాయాన్ని పుక్కిలించి ఉమ్మితే నోటి దుర్వాసన , చిగుళ్ళ సమస్యలు నుంచి విముక్తి లభిస్తుంది *ఈ మొక్క స్త్రీల యొక్క అన్ని రుగ్మతలను నయం చేయడంలో తోడ్పడుతుంది * దీని కాయలు మగవారిలో వీర్య వృద్దిని కలిగిస్తాయి. *ఒక చిటికెడు పల్లేరుకాయల చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవాళ్లలో లైంగిక బలహీనత తగ్గుతుంది.  ఈ విధంగా పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది. *పల్లేరు పువ్వుల ముద్దను ఎండబెట్టి, చూర్ణంగా దంచి, రెండు గ్రాములు తీసుకుని.. రెండు మూడు ఎండు ద్రాక్ష పండ్లతో కలిపి రోజుకి మూడుసార్లు పది పదిహేను రోజులు క్రమం తప్పకుండా సేవిస్తే ఆయాసం, ఉబ్బసం వంటివి తగ్గుతాయి. *పల్లేరు కాయలు, అశ్వగంధ వేర్లు వీటి సమభాగాల సూక్ష్మ చూర్ణాన్ని అర టీస్పూన్ తీసుకుని , రెండు టీ స్పూన్ల తేనెతో కలిపి రోజుకి రెండుసార్లు తింటూ, పావు లీటర్ పాలను తాగుతూ ఉంటే కొద్ది రోజుల్లోనే క్షయ వ్యాధి, దగ్గు,  వంటి వ్యాధులనుంచి విముక్తి లభిస్తుంది. *పల్లేరు మొక్కలు కాయలతో సహా తెచ్చి కచ్చాపచ్చాగా దంచి ఒక కప్పు మేక పాలకు కలిపి నానబెట్టి, మూడు గంటల తరువాత కొద్దిగా నీళ్లు కలిపి, దంచి గుడ్డలో వేసి పిండి, రసం తీయండి. ఈ రసాన్ని ఒక టీ స్పూన్ తేనెతో కలిపి తాగండి. ఇలా కొంతకాలంపాటు చేస్తే మగవాళ్లలో సంభోగ శక్తి పెరుగుతుంది.

Also Read: Horoscope Today: ఈరోజు ఏ రాశివారికి ఏఏ శుభఫలితాలు పొందుతారు.. ఆకస్మిక ధన లాభం కలుగుతుందంటే..

పొడి దగ్గు ఇబ్బంది పెడుతుందా.. ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గలేదా.. ఈ వంటింటి చిట్కాలు మీకోసమే

ప్రకృతి ప్రసాదించిన ఔషధం అరటి చెట్టు.. దీని పువ్వు, కాండం, ఆకు అన్నీ ఆయుర్వేద వైద్యంలో ఉపపయోగాలే