Banana In Ayurveda: ప్రకృతి ప్రసాదించిన ఔషధం అరటి చెట్టు.. దీని పువ్వు, కాండం, ఆకు అన్నీ ఆయుర్వేద వైద్యంలో ఉపపయోగాలే

 Banana In Ayurveda:భారతదేశంలో అరటి కి అత్యంత ప్రాధాన్యత ఉంది. పూజల్లో, శుభకార్యాల్లో అరటిపండ్లను ఉపయోగిస్తారు. అంతేకాదు అరటి పండుని తినడానికి కురాలుగా కూడా చేసుకుంటారు. ఇక అరటి కాయలలో రెండు..

Banana In Ayurveda: ప్రకృతి ప్రసాదించిన ఔషధం అరటి చెట్టు.. దీని పువ్వు, కాండం, ఆకు అన్నీ ఆయుర్వేద వైద్యంలో ఉపపయోగాలే
Banana Benefits
Follow us
Surya Kala

|

Updated on: Sep 20, 2021 | 8:47 AM

Banana In Ayurveda:భారతదేశంలో అరటి కి అత్యంత ప్రాధాన్యత ఉంది. పూజల్లో, శుభకార్యాల్లో అరటిపండ్లను ఉపయోగిస్తారు. అంతేకాదు అరటి పండుని తినడానికి కురాలుగా కూడా చేసుకుంటారు. ఇక అరటి కాయలలో రెండు రకాలున్నాయి. ఒక రకం పండించి పండు మాగిన తరువాత తినడానికి ఉపయోగపడేవి. రెండో రకం కేవలం కూరలలో ఉపయోగపడేవి. ఇక మన దేశంలో మొత్తం 50 రకాల అరటిపండ్లు లభిస్తున్నాయి. అరటి చెట్టులో అనేక రకాల జాతులు ఉన్నాయి..  పచ్చ అరటిపండ్లు, చక్కెరకేళి, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి, ముకిరీ, కర్పూరం.  అరటి నుంచి చిప్స్ కూడా తయారు చేస్తారు. అరటి పువ్వు, దూట ని కూరలుగా వండుతారు. ఇక కూర అరటికాయను చిప్స్ గా తయారు చేస్తారు.  అరటి ఆకులలో భోజనం చేస్తారు.  అయితే అరటి చెట్టు ఇంట్లో పెంచుకునే విషయంలో పెద్దలు కొన్ని నియమాలను పెట్టారు. ఇంట్లో ఒక చెట్టు పెంచడం ఉత్తమం, రెండు చెట్లు పెంచడం మాధ్యమం, మూడు చెట్లు పెంచడం వ్యాధి కారకం, నాలుగు చెట్లు పెంచడం నాశన కారకం అని పెద్దలమాట. కనుక అరటి చెట్టుని ఇంట్లో ఒకటి మాత్రమే పెంచుకోవాలి. ఇక అరటి చెట్టు, పండు, పువ్వులో కూడా అనేక ఔషధ గుణాలున్నాయి. అరటి చెట్టు రసం తీపి, వగరు రుచులు కలిగి ఉంటుంది. చలువ చేస్తుంది. వాతాన్ని పెంచి వీర్య పుష్టి చేస్తుంది. మూత్ర పిండాలలో రాళ్ళను, ఉదరంలోని క్రిములను, సెగరోగములును , రక్తపైత్యాన్ని పోగొడుతుంది.  ఈరోజు అరటి చెట్టువలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

*అరటి పండు సులభంగా జీర్ణమై, మలబద్ధం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. *ఆహారంగా ప్రధానమైనది. భోజనం తరువాత అరటి పండు తినడం ఆరోగ్యానికి జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది *రోజు అరటి పండు తినడం వల్ల బరువు, ఊబకాయం, ప్రేగు సంబంధిత రుగ్మతలు, మలబద్ధకం ఉపశమనం, విరేచనాలు, రక్తహీనత, క్షయవ్యాధి, ఆర్థరైటిస్, గౌట్, మూత్రపిండాలు, మూత్ర రుగ్మతల నుండి అరటి పండు కాపాడుతుంది * పచ్చి అరటి కాయలు విరేచనాలనూ, పండిపోయినవి మలబద్ధాన్నీ అల్సర్ల నూ అరికడతాయి. * అరటిపువ్వు తో చేసిన వడియాలు రుచికరమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. దగ్గు , ఆయాసం మొదలైన శ్వాస రోగాలను నివారిస్తాయి. *అరటిఆకు భోజనం చేయడం వలన జ్వరం , క్షయ, కఫవాతం, దగ్గు , ఉబ్బసం మొదలయిన వ్యాధులను నివారిస్తుంది. అంతేకాదు జటరాగ్ని , వీర్యబలాన్ని, ఆయువుని పెంచుతుంది. విషప్రభావాన్ని హరించి వేస్తుంది. * అతి రుతు రక్తశ్రావంతో ఇబ్బంది పడుతున్న స్త్రీలు బాగా మగ్గిన అరటి పండుని దేశీయ ఆవునెయ్యి తో రోజుకి మూడు సార్లు తింటే రక్త శ్రావం అదుపులోకి వస్తుంది. * గర్భాశయ వ్యాధితో ఇబ్బంది పడుతున్న కొంతమంది స్త్రీలలో యోని ద్వారా తెల్లని నీరు నిరంతరం స్రవిస్తూ ఉంటుంది.  ఇలా జరగడం వలన ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇలా ఇబ్బంది పడుతున్న మహిళలు  పచ్చి ఉసిరి రసంలో అరటి పండు, కొంచం తేనే , పటికబెల్లం కలిపి ఈ మిశ్రమాన్ని రోజూ రెండుపూటలా సేవిస్తూ ఉంటే స్త్రీల సోమరోగం నివారిస్తుంది. *కాలిన గాయాలకు కమ్మని లేపనం  బాగా పండిన అరటిపండు గుజ్జు. కాలిన గాయాలపై  బాగా పండిన అరటిపండు గుజ్జుని లేపనంగా రాస్తే.. మంట, పోటు తగ్గి గాయాలు త్వరగా మానతాయి. *మూత్రంలో మంట తో ఇబ్బంది పడుతున్నవారు బాగా మెత్తగా ఉన్న పసుపు పచ్చని చిన్న అరటి పండు రెగ్యులర్ గా తింటూ ఉంటే మంట తగ్గడమే కాక ఆమాశయం కుడా పరిశుభ్రం అవుతుంది. *తెల్ల బొల్లి మచ్చలతో ఇబ్బంది పడుతున్నవారు అరటి చెట్టు దూటనుంచి రసం తీసి తగినంత పసుపు కలిపి పైన లేపనంగా రాస్తుంటే తెల్ల బొల్లి త్వరగా నివారించబడుతుంది. * అరటి చెట్టు వేరుని మెత్తగా నూరి రసం తీసి రెండు మూడు చెంచాల రసం ఒక కప్పు నీటిలో కలిపి తాగుతూ వుంటే అతివేడి,   పైత్యం రెండు మూడు రోజుల్లో తగ్గుతుంది. *కడుపు నొప్పితో ఇబ్బందిపడేవారికీ దివ్య ఔషధం అరటి చెట్టు.. అరటి చెట్టు ఎండబెట్టి కాల్చి బూడిద చేసి జల్లించి పట్టుకోవాలి. ఈ బూడిదని 1 లేక 2 గ్రాముల మోతాదులో ఒక కప్పు నీటిలో కలిపి రొజూ మూడు పూటలా తాగితే అన్నిరకాల కడుపు నొప్పులు తగ్గుతాయి. *ఉబ్బసతో ఇబ్బందిపడేవారికి చెక్కరకేళి అరటిపండు మంచి మెడిసిన్.. రోజు పరగడుపున ఒక చక్కరకేళి అరటిపండుని తగినంత గోముత్రంలో కలిపి మెత్తగా పిసికి ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎంతటి ఉబ్బస రోగమైనా తగ్గుతుంది. *దీర్ఘకాలంగా దగ్గు తగ్గక ఇబ్బంది పడుతున్నవారు అరటిపండు తొక్క తీసి ఆ పండు మధ్యలో చిటికెన వేలు పోనిచ్చి గుంటలాగా చేసి ఆ గుంటలో గ్రాము మిరియాల పొడి వేసి ఆ పండుని ఒక మొతాదుగా రోజు రెండు పూటలా తింటూ ఉంటే దీర్ఘకాలంగా ఇబ్బంది పెట్టె దగ్గు చిటికెలో మాయం అవుతుంది. *రాచపుండు నివారణకు మెత్తటి అరటిపండ్లను వేడి అన్నం, గేద పెడ సమంగా కలిపి మెత్తగా పిసికి పైన కట్టు కడుతూ ఉంటే క్రమంగా తగ్గుతాయి. * అరటికి ఎయిడ్స్‌ వైరస్‌పై పోరాడే శక్తి ఉంది.అరటిలోఉండే ‘బాన్‌లెక్‌’ అనే రసాయనం ఎయిడ్స్‌ వైరస్‌పై శక్తిమంతంగా పోరాడుతుందని తేల్చారు. ప్రస్తుతం వైరస్‌ నిరోధానికి వాడుతున్న ‘టీ20, మారావిరాక్‌’ మందులతో సమానంగా ఈ రసాయనం పనిచేస్తుంది..అరటిలోని లెక్టిన్‌ రసాయనం వైరస్‌ను శరీరంలో ప్రవేశించనీయకుండా అడ్డుకుని ఇన్‌ఫెక్షన్‌ను నిరోధిస్తుంది.ఈ రసాయనం ప్రొటీన్‌పై పరచుకుని హెచ్‌ఐవీ జన్యుపదార్థం మూసుకుపోయేలా చేస్తుంది * అరటి తొక్క లోపల బాగాన్ని దోమ కరచిన దగ్గర రుద్దడం వలన దురద, వాపు తగ్గిపోతుంది.

Also Read:  ఈ రోజు ఈ రాశివారికి స్త్రీవలన ఆకస్మిక ధనం కలుగుతుంది.. ఏ రాశివారికి గొప్పవారితో పరిచయం ఏర్పడుతుందంటే..