AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beer Bottles: కంపెనీ ఏదైనా రంగులు మాత్రం అవే.. బీర్ సీసా కలర్ ఎందుకు ఆ రెండు రంగుల్లోనే ఉంటుందో తెలుసా..

బీర్ బ్రాండ్ ఏదైనా కావచ్చు.. సీసా మాత్రం  ఆకుపచ్చ, గోధుమ రంగుల్లోనే ఉంటాయి. ఎందుకు ఈ రంగుల్లో ఉంటాయి..? కారణం ఏంటి..?

Beer Bottles: కంపెనీ ఏదైనా రంగులు మాత్రం అవే.. బీర్ సీసా కలర్ ఎందుకు ఆ రెండు రంగుల్లోనే ఉంటుందో తెలుసా..
Beer Bottles Color
Sanjay Kasula
|

Updated on: Sep 20, 2021 | 9:13 PM

Share

బీర్.. కుర్రకారు తెగ లైక్ చేస్తారు. సమ్మర్‌లో అయితే సేల్స్ మాములగా ఉండవు. ఇక పండగలు..పబ్బలు.. పుట్టిన రోజులు అంటే చాలు బీర్ పొంగాల్సిందే.. అసలు బీర్ ఎలా తయారయ్యింది. ఇప్పుడు అది తాగేవారికి సరదాగా ఉంటే.. బీర్ తాగని వ్యక్తులకు చాలా చికాకుగా ఉంటుంది. అందుకే దాని బీర్ వ్యాపారం అభివృద్ధి చెందుతోంది. బీర్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని తాగేవారు నమ్ముతుంటారు. కానీ ఈ రోజు మనం బీర్ ప్రయోజనాలు.. దాని కథ గురించి కాకుండా మరో ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. బీర్ బ్రాండ్ ఏదైనా కావచ్చు.. సీసా మాత్రం  ఆకుపచ్చ, గోధుమ రంగుల్లోనే ఉంటాయి. ఎందుకు ఈ రంగుల్లో ఉంటాయి..? కారణం ఏంటి..? ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి వస్తుంటాయి. అసలు సంగతి తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ప్రాచీన మెసొపొటేమియా సుమేరియన్ నాగరికత కాలం నుంచి బీరును తాగుతున్నారు.

7 వేల ఏళ్ల క్రితం మెసోపోటామియా సంస్కృతిలో బీరు కల్చర్‌ ఆసక్తికరంగా ప్రారంభమైంది. వేలాది సంవత్సరాల క్రితం పురాతన ఈజిప్టులో మొట్టమొదటి బీర్ కంపెనీ ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. అప్పుడు బీర్ ప్యాకింగ్ ఒక పారదర్శక సీసాలో ప్యాక్ చేశారు. అయితే బీర్‌లో ఉండే  ఆమ్లంతో సూర్య కిరణాల నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చర్య జరగడంతో ఆ బీర్ చెడిపోతుందని గుర్తించారు. దీంతో బీర్ దుర్వాసన వస్తుంది. తాగడానికి ఉపయోగ పడకుండా పోతుందని తెలుసుకున్నారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి బీర్ తయారీదారులు ఒక ప్రణాళికను రూపొందించారు. దీని కింద గోధుమ రంగు పూసిన సీసాలు బీర్ కోసం ఎంపిక చేసుకున్నారు. ఈ ట్రిక్ చాలా అద్భుతంగా పని చేసింది. ఇలా రంగు సీసాలో పోసిన బీరు చెడిపోకుండా సురక్షితంగా ఉంది. అంతే కాదు చెడిపోకుండా వాసన, రుచి మారిపోలేదు.  

రెండవ ప్రపంచ యుద్ధంలో బీరు సీసాలు ఆకుపచ్చగా పెయింట్ మొదలు పెట్టారు. నిజానికి రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో గోధుమ సీసాల కరువు ఏర్పడింది. ఈ రంగు సీసాలు అందుబాటులో లేవు. ఈ పరిస్థితిలో బీర్ తయారీదారులు మరో రంగును ఎంచుకోవల్సి ఉచ్చింది.  ఆ సమయంలో గోదుమ రంగు సీసాల స్థానంలో గ్రీన్ కలర్ సీసాలను ఉపయోగించారు. అప్పటి నుంచి ఈ రెండు రంగులను బీర్ సీసాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇదిండీ.. బీర్ సీసా రంగు కథ.. 

ఇవి కూడా చదవండి: Hyderabad: దూసుకుపోతున్న హైదరాబాద్.. ఢిల్లీ, ముంబై ఆ తర్వాత మనమే.. ఎందులోనో తెలుసా..

PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఈ 5 నష్టాలు తప్పవు.. ఇందులో ఇవి చాలా ముఖ్యం..