Bananas Side Effects: అరటిపండుని ఇష్టంగా తింటున్నారా.. అధికంగా తింటే దుష్ప్రరిణామాలు ఎన్నో..

Bananas Side Effects: ప్రపంచంలో అత్యధికంగా తినే పండు అరటిపండు. దీనిని తిననివారు.. ఇష్టపడని వారు బహుఅరుదు.. పేదవాడికి అందుబాటులో ఉండే..

Bananas Side Effects: అరటిపండుని ఇష్టంగా తింటున్నారా.. అధికంగా తింటే దుష్ప్రరిణామాలు ఎన్నో..
Banana Side Effects
Follow us
Surya Kala

|

Updated on: Dec 11, 2021 | 8:48 PM

Bananas Side Effects: ప్రపంచంలో అత్యధికంగా తినే పండు అరటిపండు. దీనిని తిననివారు.. ఇష్టపడని వారు బహుఅరుదు.. పేదవాడికి అందుబాటులో ఉండే ఈ అరటి పండుతో అనేక ఆరోగ్య ప్రయోజలున్నాయి. అరటిపండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు, చాలా పోషకాలను కూడా ఉన్నాయి. అరటిపండ్లు ఆరోగ్యకరమే అయినప్పటికీ.. వీటిని అతిగా తినడంవలన లేదా.. కొందరి శరీర తత్వానికి వీటిని తినడం వలన ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు అరటిపండు ప్రేమికులైతే, అరటిపండు అతిగా తింటే కలిగే దుష్ప్రభావాలగురించి తెలుసుకుందాం ..

*అరటిపండ్లు అతిగా తింటే.. శరీరం ఇతర పోషకాలను గ్రహించే శక్తిని కోల్పోతాయి. *అరటిపళ్ళు ఎక్కుగా తింటే.. దానిలోని పిండి పదార్ధాలు జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుంది. దీని ప్రభావం జీర్ణాశయం మీద పడి జీర్ణ శక్తి లోపిస్తుంది. బరువు పెరిగేలా చేస్తుంది. *రోజులో రెండు, మూడు కంటే ఎక్కువ అరటిపళ్ళు తింటే.. అందులోని పీచు పదార్ధం.. ఆహారం జీర్ణం కాకుండా చేస్తుంది. కడుపునొప్పి, గ్యాస్ సమస్యలు ఏర్పడే అవకాశం అధికం. *అరటిపండ్లు తినడం వల్ల వచ్చే ఒక దుష్ఫలితం .. దీనిలో అధికంగా ఉన్న ప్రొటీన్,  ఫైబర్ కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తాయి. దీంతో ఆకలి మందగిస్తుంది. *అరటిపండులోని ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ మీకు నిద్రపోయేలా చేస్తుంది. *అరటిపండ్లను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. *అరటిపండులోని అమైనో ఆమ్లం  కొన్నిసార్లు తలనొప్పి కలిగేలా చేస్తాయి. *అరటిపండ్లలో పిండిపదార్థం పుష్కలంగా ఉంటుంది..  ఇది దంతక్షయానికి కారణమవుతాయి. *అరటిపండులో విటమిన్ బి6 పుష్కలంగా ఉంది. కనుక అరటిపండు అధికంగా తీసుకోవడం వల్ల నరాల దెబ్బతినే అవకాశం ఉంది. *ఆస్తమాతో బాధపడేవారు ఆహారంలో అరటిపండును తినకూడదు.

అందుకని అరటిపండు ప్రేమికులైనా సరే.. రోజుకి రెండు మూడు కంటే ఎక్కువ తినవద్దని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:  పాతతరం సాంప్రదాయ స్వీట్ నువ్వుల లడ్డు.. రోజు ఒకటి తిన్నా అద్భుతప్రయోజనాలు.. రెసిపీ మీకోసం..