Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENO అతిగా వాడుతున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే చాలా డేంజర్‌!

యాసిడిటీకి తక్షణ ఉపశమనం కోసం చాలా మంది ఈనోను ఆశ్రయిస్తున్నారు. కానీ, దీని అధిక వినియోగం జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. ఈనోకు బదులుగా ఆపిల్ సైడర్ వెనిగర్, కొబ్బరి నీరు, అల్లం టీ, కలబంద రసం వంటి సహజమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.

ENO అతిగా వాడుతున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే చాలా డేంజర్‌!
Acidity
SN Pasha
|

Updated on: Jul 04, 2025 | 8:03 PM

Share

యాసిడిటీ సమస్యతో చాలా మంది ఇన్‌స్టెంట్‌ రిలీఫ్‌ కోసం ఈనోను ఎక్కువగా వాడుతుంటారు. కడుపు నిండా అన్నం తినేశాం అని ఫీలైనా.. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లి భోజనం చేసినా.. లేదా కడుపు కాస్త ఉబ్బరంగా అనిపించినా వెంటనే ఈనో ప్యాకెట్‌ చింపేసి.. నీళ్లలో కలిపేసి తాగేస్తుంటారు. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు. కానీ కొంతమంది దీన్ని అదే పనిగా వాడుతుంటారు. ఈనోను అతిగా వాడటం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పోషకాహార నిపుణురాలు శిఖా గుప్తా కశ్యప్ ప్రకారం.. యాసిడిటీ తరచుగా కడుపులో ఆమ్లం తక్కువగా ఉండటం వల్ల వస్తుంది. ఎక్కువగా ఉండటం వల్ల కాదు. సోడియం బైకార్బోనేట్ సిట్రిక్ యాసిడ్ మిశ్రమాన్ని కలిగి ఉన్న ఈనో ఫిజీ రియాక్షన్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్వల్పకాలిక ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే, మీరు దీన్ని తరచుగా ఉపయోగిస్తే, అది మీ కడుపు దాని స్వంత ఆమ్ల ఉత్పత్తిని తగ్గించుకునేలా చేస్తుంది. కాలక్రమేణా ఇది మీ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. యాంటాసిడ్‌లపై మీ ఆధారపడటాన్ని పెంచుతుంది అని ఆమె తెలిపారు.

అత్యవసర పరిస్థితులకు Eno ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, ప్రతీ రోజు జీర్ణ సమస్య పరిష్కారం కోసం దానిపై ఆధారపడకుండా ఉండటం ముఖ్యం. దానికి బదులుగా ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌ను గోరువెచ్చని నీటితో కలిపి, ఒక స్ట్రా ద్వారా సిప్ చేయండి. ఇది మీ కడుపు ఆహారాన్ని మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. అలాగే కొబ్బరి నీళ్లు తాగడం కూడా ఉత్తమం. కొబ్బరి నీరు మీ శరీరం pH ని సమతుల్యతలోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. అల్లం టీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అల్లం టీ మంటను తగ్గిస్తుంది, గుండెల్లో మంటను కూడా సహజంగా తగ్గిస్తుంది. కలబంద రసంలో జీర్ణక్రియకు మద్దతు ఇచ్చే ఎంజైమ్‌లు ఉంటాయి. కలబంద రసం కూడా ఈనోకు బదులుగా తీసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి