AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి ఫ్రిజ్ లో పెట్టిన చికెన్ కర్రీ తింటున్నారా..? మస్ట్ గా తెలుసుకోండి..!

మనలో చాలా మందికి చికెన్ కూర లేదా ఫ్రై మిగిలిపోతే ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు తినే అలవాటు ఉంటుంది. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది శరీరానికి ముప్పు తెచ్చి పెట్టే అలవాటు. ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్ వంటకాల్లో బ్యాక్టీరియా పెరుగుతూ ఆహారవిషబాధకు దారితీస్తుంది. వెంటనే తినడమే సురక్షితం.

రాత్రి ఫ్రిజ్ లో పెట్టిన చికెన్ కర్రీ తింటున్నారా..? మస్ట్ గా తెలుసుకోండి..!
Chicken Curry
Prashanthi V
|

Updated on: Sep 03, 2025 | 10:45 PM

Share

మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంది. చికెన్ కూర లేదా ఫ్రై ఎక్కువగా మిగిలిపోతే.. దానిని ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు తింటారు. ఇలా చేయడం వల్ల ఆహారం వృథా కాకుండా ఉంటుంది అని అనుకుంటాం. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

ఎందుకు ప్రమాదం..?

చికెన్‌ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. చికెన్ వండిన తర్వాత ఎక్కువసేపు గది ఉష్ణోగ్రతలో ఉంచినా లేదా ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేసినా అందులో బ్యాక్టీరియా చాలా వేగంగా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్ళినప్పుడు ఫుడ్ పాయిజనింగ్ వచ్చే అవకాశం ఉంది. సాల్మొనెల్లా (Salmonella), ఇ.కోలై (E. Coli) వంటి బ్యాక్టీరియా చికెన్‌లో చాలా త్వరగా వ్యాపిస్తాయి.

ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు

  • వాంతులు
  • విరేచనాలు
  • కడుపు నొప్పి
  • తలనొప్పి
  • జ్వరం
  • నీరసం

ఈ సమస్యలు ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో మరింత తీవ్రంగా మారవచ్చు.

ఫ్రిజ్‌లో పెట్టినా సురక్షితం కాదా..?

చాలా మంది ఫ్రిజ్‌లో పెట్టాం కాబట్టి చికెన్ పాడవదు అని అనుకుంటారు. కానీ ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా పూర్తిగా చనిపోదు, కేవలం వాటి పెరుగుదల నెమ్మదిస్తుంది అంతే. ఆ ఆహారాన్ని మళ్ళీ వేడి చేసి తిన్నా, బ్యాక్టీరియా నుండి వచ్చే విష పదార్థాలు అలాగే ఉండిపోతాయి. ఇవే ఫుడ్ పాయిజనింగ్‌కు ప్రధాన కారణం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • వండిన వెంటనే తినండి.. చికెన్‌ ను వండిన తర్వాత ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే తినడం ఉత్తమం.
  • ఎక్కువగా వండకండి.. అవసరానికి సరిపోయేంత మాత్రమే వండుకుంటే నిల్వ చేయాల్సిన అవసరం ఉండదు.
  • పాత చికెన్ వద్దు.. రెండు రోజుల కంటే ఎక్కువ ఫ్రిజ్‌లో ఉంచిన చికెన్ వంటకాలకు వాడకండి.
  • పిల్లలు, వృద్ధులకు వద్దు.. వీరికి ఫ్రిజ్‌లో పెట్టిన వంటకాలను ఇవ్వకపోవడం మంచిది.

చికెన్ వండిన వెంటనే వేడి వేడిగా తింటేనే రుచిగా, తాజాగా ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు తింటే అది రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికీ హాని చేస్తుంది. కాబట్టి సౌకర్యం కంటే ఆరోగ్యం ముఖ్యం అని గుర్తుంచుకుని.. వండిన చికెన్‌ను వెంటనే తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్