ఒంట్లో కొవ్వు వెన్నలా కరగాలంటే.. ఈ పండు తొక్కతో చేసిన టీ ఓ కప్పు తాగాల్సిందే!
దానిమ్మ గింజలే కాదు దాని తొక్కలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దానిమ్మ తొక్కలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ తొక్కను పారవేసే బదులు, దానిని సరిగ్గా ఉపయోగిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు..

దానిమ్మ గింజలు ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ దానిమ్మ గింజలే కాదు దాని తొక్కలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దానిమ్మ తొక్కలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ తొక్కను పారవేసే బదులు, దానిని సరిగ్గా ఉపయోగిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ తొక్కతో టీ తయారు చేసి తాగితే దానిలోని ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. కాబట్టి ఇంట్లో ఈ టీని ఎలా తయారు చేసుకోవాలి? ఇది ఎలాంటి ఆరోగ్య సమస్యలకు మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..
దానిమ్మ తొక్క టీ ఎలా తయారు చేయాలంటే..
అవసరమైన పదార్థాలు
- దానిమ్మ తొక్క (శుభ్రం చేసినది)
- రెండు కప్పుల నీరు
- తేనె లేదా నిమ్మరసం (రుచికి)
తయారీ విధానం:
ఎండిన దానిమ్మ తొక్కను చిన్న ముక్కలుగా చేయాలి. ఒక పాత్రలో రెండు కప్పుల నీరు పోసి మరిగించాలి. నీరు మరిగేటప్పుడు తరిగిన దానిమ్మ తొక్కను జోడించాలి. పది నుంచి పదిహేను నిమిషాలు మరిగించాలి. తరువాత టీని ఒక కప్పులోకి కట్టాలి. కావాలనుకుంటే రుచికి కొద్దిగా తేనె, నిమ్మరసం వేసి తాగవచ్చు.
ప్రయోజనాలు ఏమిటి?
యాంటీఆక్సిడెంట్లు
దానిమ్మ తొక్కల్లో పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియకు మంచిది
దానిమ్మ తొక్కలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అవి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో, శక్తి స్థాయిలను పెంచడంలో, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
చర్మ ఆరోగ్యానికి మంచిది
దానిమ్మ తొక్కలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలో మంట, మొటిమలు, అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. అంతేకాదు, ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
వేగంగా బరువు తగ్గొచ్చు
దానిమ్మ తొక్క జీవక్రియను పెంచడంలో సహాయపడటమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఇది సహజ మూత్రవిసర్జన, శరీరం నుంచి అదనపు ద్రవాలను తొలగించడంలో సహాయపడుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








