Scrub Typhus: ఉత్తర భారతంలో కొత్త కలవరం.. చిన్నారులకు ప్రబలుతున్న వింత వ్యాధి.. యూపీలో 8మంది మృత్యువాత!

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Sep 02, 2021 | 10:53 AM

ఉత్తర భారతంలో కొత్త కలవరం మొదలైంది. గత కొన్ని రోజులుగా విస్తరిస్తున్న వింత వ్యాధితో చిన్నారులు మృత్యువాతపడటం కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో మరో కొత్త రకం వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు యూపీ ఆరోగ్య తెలిపింది.

Scrub Typhus: ఉత్తర భారతంలో కొత్త కలవరం.. చిన్నారులకు ప్రబలుతున్న వింత వ్యాధి.. యూపీలో 8మంది మృత్యువాత!
Scrub Typhu

Kids Diagnosed with Scrub Typhu: ఉత్తర భారతంలో కొత్త కలవరం మొదలైంది. గత కొన్ని రోజులుగా విస్తరిస్తున్న వింత వ్యాధితో చిన్నారులు మృత్యువాతపడటం కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో మరో కొత్త రకం వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు యూపీ ఆరోగ్య తెలిపింది. దీని కారణంగా ఇప్పటికే అక్కడ చాలా మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారని తెలుస్తోంది. దీన్ని స్ర్కబ్‌ టైఫస్‌ వ్యాధిగా వైద్య నిపుణులు గుర్తించారు.

ఇందుకు సంబంధించి తాజాగా మథుర జిల్లా మెడికల్‌ ఆఫీసర్ డాక్టర్‌ రచన గుప్తా మాట్లాడుతూ.. ఒక్క కోహ్‌ గ్రామంలోనే 26 మంది స్ర్కబ్‌ టైఫస్‌ వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. పిప్రోత్‌లో ముగ్గురు, రాల్‌లో 14, జసోడాలో 17 మందికి ఈ వ్యాధి సోకిందన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే పది మంది మరణించగా.. ఇందులో 8 మంది చిన్నారులు ఉన్నట్లుగా నివేదికలు అందాయని వివరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు పశ్చిమంగా ఉన్నా ఆగ్రా, ఫిరోజాబాద్, మెయిన్‌పురి, ఎటా, కస్గంజ్ జిల్లాలో వ్యాధి సోకి మరణాలు కూడా సంభవించాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల నుంచి అధికారులు నమూనాలు సేకరిస్తున్నారని వెల్లడించారు.

స్ర్కబ్‌ టైఫస్‌ వ్యాధి అంటే ఏంటీ? సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. స్క్రబ్ టైఫస్‌ అనేది ఓరియెంటియా త్సుత్సుగముషి (orientia tsutsugamushi) అనే బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. చిగ్గర్స్ (larval mites) అనే పురుగు కాటు ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. దీన్ని ‘ష్రబ్‌ టైఫస్’ అని కూడా పిలుస్తారు.

వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి.. చిగ్గర్స్‌ కాటుకు గురైన వారిలో ముందు 10రోజుల వరకు విపరీతమైన జ్వరం, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, ఒళ్లంతా దద్దుర్లు పుట్టడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి నివారణకు ప్రస్తుతం ఎటువంటి టీకాలు అందుబాటులో లేవని సీడీసీ తెలిపింది. వ్యాధి బారిన పడిన వారి నుంచి దూరంగా ఉండాలని చెప్పింది. చిగ్గర్స్ ఎక్కువగా చెట్ల పొదలు ఉన్న ప్రాంతంలో సంచరిస్తుంటాయని.. ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండడమే మంచిదని సీడీసీ పేర్కొంది. అంతేకాకుండా చిన్నారుల శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వాడాలని సూచించింది.

Read Also…  Horoscope Today: ఈరాశుల వారికి ఉద్యోగాల్లో సమస్యలు.. ఖర్చులు అధికం.. ఈరోజు రాశిఫలాలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu