Health: ఓర్నీ… పాలల్లో బెల్లం కలుపుకుని తాగినే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా..?

తరచూ అలసటగా, బలహీనత, ఇతర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు పాలలో బెల్లం కలుపుకుని తాగితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా బెల్లం పాలు ప్రభావవంతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. , మలబద్ధకం వంటి అనేక పొట్ట సమస్యల నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది.

Health: ఓర్నీ... పాలల్లో బెల్లం కలుపుకుని తాగినే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా..?
Milk With Jaggery
Follow us

|

Updated on: May 04, 2024 | 6:13 PM

పాలు, బెల్లం..  రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకుంటే చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.   బెల్లంలో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్ వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. పాలు ఎముకలు, దంతాలు దృఢంగా మార్చుతాయి.శరీరానికి విటమిన్ D లభిస్తుంది. పాలల్లో బెల్లం కలిపి తీసుకుంటే శరీరాన్ని హెల్తీగా ఉంచడమే కాకుండా.. రక్తాన్ని డీటాక్స్ చేసేలా పనిచేస్తుంది. ఈ కాంబినేషన్ తీసుకుంటే మరిన్ని బెనిఫిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. పాలలో బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలోని అదనపు కొవ్వు తగ్గుతుంది. స్థూలకాయాన్ని నివారిస్తుంది. శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతుంది.
  2. బెల్లం, పాలలో సహజంగా ఉండే యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి.
  3. బెల్లం పాలు తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య దూరమవుతుంది.
  4. బెల్లం పాలలోని పోషకాలు జుట్టు సంరక్షణకు మేలు చేస్తాయి. ఈ కాంబినేషన్ జుట్టు మెరిసేలా చేస్తుంది.  జుట్టు రాలడం, చుండ్రును నయం చేస్తుంది.
  5. బహిష్టు సమయంలో విపరీతమైన కడుపునొప్పి, నడుము నొప్పికి బెల్లం పాలు ఉత్తమ ఔషధం. ఇది నొప్పిని తగ్గిస్తుంది.
  6. వృద్ధాప్యంలో ఉన్నవారికి కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  7. బెల్లం పాలు తాగితే శరీరంలో శక్తి స్థాయిలు పెరిగి నీరసం, అలసట తగ్గుతాయి.
  8. అజీర్ణ సమస్య ఉన్నవారు బెల్లం పాలను తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు
  9.  మలబద్ధకం వంటి అనేక పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది
  10. బెల్లంలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది
  11. వ్యాయామం చేసిన తర్వాత ఒక గ్లాసు బెల్లం పాలు తాగడం వల్ల మీ శరీరం వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. అయితే, దీన్ని మితంగా తీసుకోవాలి.
  12. పాలు, బెల్లం కలిపి తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. పాలు యాంటీ స్ట్రెస్ ఏజెంట్. బెల్లం కలిపి ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మీ కండరాలు రిలాక్స్ అవుతాయి. మీరు మంచి నిద్రను ఆస్వాదించవచ్చు.
  13. బెల్లంలో ఉండే పొటాషియం, సోడియం శరీరంలోని యాసిడ్స్ స్థాయిని మెయింటెన్ చేయడంలో సహాయపడతాయి. బెల్లం, పాలు తీసుకోవడం రక్తపోటు స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది.

(ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. ఫాలో అయ్యేముందు వైద్యులను సంప్రదించండి)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles